Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరు జనసేన కో-ఆర్డినేషన్ కమిటీలో ప్రమీల ఓరుగంటికి చోటు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆత్మకూరు జనసేన కో-ఆర్డినేషన్ కమిటీలో ప్రమీల ఓరుగంటికి చోటు

వార్త ముఖ్యాంశాలు

  • మర్రిపాడు: ఆత్మకూరు నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల జనసేన పార్టీ కో-ఆర్డినేషన్ కమిటీలో మర్రిపాడు మండలానికి చెందిన మహిళా నాయకురాలు ప్రమీల ఓరుగంటికి చోటు లభించింది.
  • ఈ మేరకు జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
  • రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయడం, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం సాధించడం, ఎన్నికల వ్యూహాల అమలుకు ఈ కమిటీ పనిచేయనుంది.

మర్రిపాడు: ఆత్మకూరు నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల జనసేన పార్టీ కో-ఆర్డినేషన్ కమిటీలో మర్రిపాడు మండలానికి చెందిన మహిళా నాయకురాలు ప్రమీల ఓరుగంటికి చోటు లభించింది. ఈ మేరకు జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయడం, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం సాధించడం, ఎన్నికల వ్యూహాల అమలుకు ఈ కమిటీ పనిచేయనుంది. ప్రమీలకు అవకాశం కల్పించడంపై జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పవన్ కళ్యాణ్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, అభ్యర్థుల విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రమీల పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *