Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వరికుంటపాడు మండల పరిషత్ అధ్యక్ష పదవికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా దిలీప్ కుమార్ కొండేపోగు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వరికుంటపాడు మండల పరిషత్ అధ్యక్ష పదవికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా దిలీప్ కుమార్ కొండేపోగు

వార్త ముఖ్యాంశాలు

  • వరికుంటపాడు: మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో మాజీ గ్రామ సర్పంచ్ దిలీప్ కుమార్ కొండేపోగు ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలవనున్నట్లు ప్రకటించారు.
  • అన్ని శాఖల పరిపాలనపై అవగాహన, ప్రజా సమస్యలపై పోరాటం, ప్రశ్నించే తత్వం తన బలమని తెలిపారు.
  • పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యమన్నారు.

వరికుంటపాడు: మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో మాజీ గ్రామ సర్పంచ్ దిలీప్ కుమార్ కొండేపోగు ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలవనున్నట్లు ప్రకటించారు. అన్ని శాఖల పరిపాలనపై అవగాహన, ప్రజా సమస్యలపై పోరాటం, ప్రశ్నించే తత్వం తన బలమని తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యమన్నారు. వరికుంటపాడు బీసీ హాస్టల్ పునఃప్రారంభం, పెద్దిరెడ్డిపల్లిలో నూతన హాస్టల్ ఏర్పాటు, ప్రజలకు ఇబ్బందికరమైన నిర్మాణాల నివారణ, స్టాప్ మైనింగ్, ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తానన్నారు. గ్రామాల అభివృద్ధి, సంక్షేమం, హెల్మెట్ వినియోగం, హెల్త్, టర్మ్ ఇన్సూరెన్స్‌పై అవగాహన కల్పిస్తానన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *