Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

పేద కుటుంబాలకు అండ ఆర్థిక సహాయం అందజేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పేద కుటుంబాలకు అండ ఆర్థిక సహాయం అందజేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్

పేద కుటుంబాలకు అండగా పి4 బంగారు కుటుంబం.

రూ.4.80 లక్షల ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.

కష్టాల్లో ఉన్న కుటుంబాలకు చేయూత.

స్వయం ఉపాధితో ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సూచన.

మైలవరం నియోజకవర్గంలో 8 కుటుంబాలకు ఆర్థిక భరోసా

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, 12/10/2026.

పేదరికంలో ఉన్న కుటుంబాలకు అండగా నిలిచి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్న పి4 (P4) బంగారు కుటుంబం కార్యక్రమం ద్వారా మైలవరం నియోజకవర్గంలో 8 కుటుంబాలకు రూ.4.80 లక్షల ఆర్థిక సహాయం అందించారు. మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు సోమవారం విజయవాడ మండలం గొల్లపూడిలోని తన కార్యాలయంలో లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

వివిధ కారణాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ, కుటుంబ పోషణకు సైతం ఇబ్బంది పడుతున్న వారికి ఈ కార్యక్రమం ద్వారా చేయూత అందించారు. కుటుంబానికి ఆధారమైన వ్యక్తులను కోల్పోయిన వారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలు, దివ్యాంగ పిల్లల సంరక్షణ భారాన్ని మోస్తున్న వారు, స్వయం ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న వారికి ప్రాధాన్యతనిస్తూ సహాయం అందించారు.

మైలవరం పట్టణానికి చెందిన షేక్ సైదా కుటుంబానికి పెద్ద కుమారుడిని రోడ్డు ప్రమాదంలో కోల్పోవడంతో పాటు కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చిన్న కుమారుడు ఇర్ఫాన్‌కు అల్యూమినియం ఫ్రేమ్‌వర్క్, గ్లాస్ ప్రింటింగ్ పనుల్లో నైపుణ్యం ఉండటంతో షాపు ఏర్పాటు చేసుకుని జీవనోపాధి పొందేందుకు రూ.75 వేలు అందించారు.

మైలవరం పట్టణానికి చెందిన షేక్ మౌలా వృద్ధాప్యం కారణంగా లారీ డ్రైవర్‌గా పనిచేయలేని పరిస్థితిలో ఉండటంతో కుటుంబ పోషణ కోసం టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసుకునేందుకు రూ.40 వేలు ఆర్థిక సాయం అందించారు.

మైలవరం మండలంలోని పొందుగల గ్రామానికి చెందిన గోగులోతు రమేశ్ బాబు ఇటీవల తుఫాను సమయంలో జరిగిన ప్రమాదంలో రెండు కళ్ల చూపును కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయనకు రూ.50 వేలు ఆర్థిక సహాయం అందించారు.

జి.కొండూరు మండలం కవులూరు చెందిన అల్లూరి నర్సమ్మ కుటుంబం అనేక ఆరోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆమె భర్త గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ పేస్‌మేకర్‌ అమర్చించుకోగా, చిన్న కుమారుడికి కూడా గుండె సమస్యలు ఉన్నాయి. పెద్ద కుమారుడు సోరియాసిస్‌తో బాధపడుతున్నాడు. ఈ కుటుంబానికి రూ.75 వేలు ఆర్థిక సహాయం అందించారు.

ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన 11 ఏళ్ల పులగర లోసీ కాలేయ వ్యాధితో బాధపడుతూ చికిత్స కోసం ఆర్థిక సహాయం అవసరమైన పరిస్థితిలో ఉంది. వైద్య ఖర్చుల నిమిత్తం తక్షణ సాయంగా రూ.50 వేలు అందించారు.

అదే ప్రాంతానికి చెందిన కన్నా శృతిమయి, కన్నా అమూల్య పుట్టుకతోనే మానసిక, అంగ వైకల్యాలతో బాధపడుతూ నిత్యం తల్లిదండ్రుల సంరక్షణపై ఆధారపడుతున్నారు. వారి కుటుంబానికి కుటీర పరిశ్రమ ఏర్పాటు ద్వారా జీవనోపాధి కల్పించేందుకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందించారు.

ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడికి చెందిన పెంజర్తి రజిని భర్తను రోడ్డు ప్రమాదంలో కోల్పోయి, ఇద్దరు చిన్నారులను పోషించుకుంటూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆమెకు జనరల్ షాపు ఏర్పాటు చేసుకునేందుకు రూ.50 వేలు అందించారు.

కొండపల్లి మున్సిపాలిటీకి చెందిన మొగులూరి మరియబాబు పక్షవాతంతో మంచానికే పరిమితమవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. భార్య, ముగ్గురు కుమార్తెలతో ఉన్న ఈ కుటుంబానికి బడ్డీ కొట్టు ఏర్పాటు చేసుకుని జీవనోపాధి పొందేందుకు రూ.40 వేలు ఆర్థిక సహాయం అందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించి, వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అందించిన ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి మార్గాలను అభివృద్ధి చేసుకోవాలని, తద్వారా కుటుంబాలను ఆర్థికంగా నిలబెట్టుకోవాలని సూచించారు. కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల సహకారం అందించడంతో పాటు వారు స్వయంగా ఎదిగేలా అవకాశాలు కల్పించడమే పి4 బంగారు కుటుంబం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలిచి, వారి జీవితాల్లో భరోసా నింపే దిశగా పి4 కార్యక్రమం ఉపయోగపడుతోందని ఈ సందర్భంగా వెల్లడించారు.

మొత్తం రూ.4.80 లక్షల ఆర్థిక సహాయంతో 8 కుటుంబాలకు చేయూత అందించిన ఈ కార్యక్రమం, స్వయం ఉపాధి ద్వారా పేద కుటుంబాలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు దోహదపడనుంది

పేద కుటుంబాలకు అండ ఆర్థిక సహాయం అందజేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్

పేద కుటుంబాలకు అండ ఆర్థిక సహాయం అందజేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *