Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరం నియోజవర్గం ఇద్దరు వైద్యం ఖర్చు ఎల్ ఓ సి లు మంజూరు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మైలవరం నియోజవర్గం ఇద్దరు వైద్యం ఖర్చు ఎల్ ఓ సి లు మంజూరు

మైలవరం నియోజకవర్గంలో రూ.28.5 కోట్ల వైద్య సహాయం.

ఇద్దరి వైద్య చికిత్సలకు తాజాగా రూ.4.60 లక్షల ఎల్.ఓ.సీలు మంజ

ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారి చొరవతో బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు.

ఎన్టీఆర్ జిల్లా, గొల్లపూడి, అక్టోబర్ 14:

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మైలవరం నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ.28.5 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ రీయింబర్స్‌మెంట్ చెక్కులు, లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్.ఓ.సీ.)లు మంజూరయ్యాయి.

పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించి, ఆపద సమయంలో అండగా నిలవాలనే లక్ష్యంతో ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయం ఎంతో మందికి ఊరటనిస్తోంది.

తాజాగా మరో ఇద్దరి వైద్య చికిత్సల కోసం రూ.4,60,775 విలువైన ఎల్.ఓ.సీలను మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన పత్రాలను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో బుధవారం అందజేశారు.

లక్ష్మీపురం-2 (అర్బన్)కు చెందిన వనార్చి మనీష గారి బిడ్డ వైద్య చికిత్సకు రూ.2,56,179, ఇబ్రహీంపట్నం పట్టణానికి చెందిన గుమ్మడి సైమను గారి వైద్య చికిత్సకు రూ.2,04,596 చొప్పున ప్రభుత్వం ఎల్.ఓ.సీలు మంజూరు చేసింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు.

వైద్య చికిత్సల కోసం ఆర్థిక సహాయం మంజూరు కావడంతో బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి. తమకు ఆపద సమయంలో అండగా నిలిచి, వైద్య చికిత్సలకు ఆర్థిక భరోసా కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, సహాయం అందేలా చొరవ చూపిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ వైద్య సహాయం అందేలా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు నిరంతరం చొరవ చూపుతున్నారు. రాజకీయాలకు అతీతంగా అవసరమైన వారికి సీఎంఆర్ఎఫ్ రీయింబర్స్‌మెంట్, ఎల్.ఓ.సీల ద్వారా ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తున్నారు.

మైలవరం నియోజవర్గం ఇద్దరు వైద్యం ఖర్చు ఎల్ ఓ సి లు మంజూరు

మైలవరం నియోజవర్గం ఇద్దరు వైద్యం ఖర్చు ఎల్ ఓ సి లు మంజూరు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *