పున్నమి ప్రతినిధి అక్టోబర్ 12 రాజన్న సిరిసిల్ల జిల్లా
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే బతుకమ్మ దసరా పండుగకు ఊర్లకు వెళ్లేవారు ఇండ్ల భద్రతపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే సూచించారు ప్రజల సహకారంతోనే నేరాల నివారణ సాధ్యమన్నారు తాళాలు కనిపించకుండా ఉంచడం విలువైన వస్తువులు బ్యాంక్ లాకర్లో దాచడం సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం ఒక గదిలో లైట్ వెలిగేలా ఉంచడం చేయాలన్నారు అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100 లేదా 112 కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు దీనికి ప్రజల సహాయ సహకారాలు అందించాలని అనుమానిత వ్యక్తులు కనబడినచో పోలీసులకు సమాచారం అందించితే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని శిక్షించడం జరుగుతుంది
