Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

మూలపాడు 47 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం శంకుస్థాపన మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మూలపాడు 47 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం శంకుస్థాపన మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్

మూలపాడులో రూ.47 లక్షలతో సిమెంట్ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన.

పల్లెపండుగ 3.0 కింద అంతర్గత రహదారుల అభివృద్ధి.

పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.

ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, 12/10/2026.

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు.

ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలో వీబీజీ రాంజీ నిధులు, పల్లెపండుగ 3.0 కింద రూ.47 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సిమెంట్ రహదారుల పనులకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు సోమవారం ఉదయం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు, గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయిస్తూ రహదారుల నిర్మాణ పనులను చేపడుతున్నట్లు తెలిపారు.

పల్లెపండుగ 3.0 కార్యక్రమం ద్వారా గ్రామాల్లో రహదారుల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యమన్నారు.

ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) గారు, స్థానిక కూటమి నాయకులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మూలపాడు 47 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం శంకుస్థాపన మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్

మూలపాడు 47 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం శంకుస్థాపన మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *