వార్త ముఖ్యాంశాలు
- *సోమవారం జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమం రద్దు* *ప్రజలు తమ వినతులతో కలెక్టరేట్‌కు రావద్దు* ---జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ సోమవారం (అక్టోబర్ 12)న రద్దు చేసినట్లు *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్…
- రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రబీ పంటల ప్రణాళిక, పంటల సాగు విధానాలు, పంటల వైవిధ్యీకరణ, వ్యవసాయ నిర్వహణ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు *తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి* రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్న నేపథ్యంలో, అక్టోబర్ 12వ తేదీ (సోమవారం)న నిర్వహించనున్న రైతు నేస్తం కార్యక్రమం…
- ప్రజలు ఈ విషయాన్ని గమనించి తమ వినతులు, ఫిర్యాదులతో సోమవారం కలెక్టరేట్‌కు రావద్దని *కలెక్టర్* కోరారు.
*సోమవారం జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమం రద్దు*
*ప్రజలు తమ వినతులతో కలెక్టరేట్‌కు రావద్దు*
—జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా*
జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ సోమవారం (అక్టోబర్ 12)న రద్దు చేసినట్లు *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రబీ పంటల ప్రణాళిక, పంటల సాగు విధానాలు, పంటల వైవిధ్యీకరణ, వ్యవసాయ నిర్వహణ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు *తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి* రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్న నేపథ్యంలో, అక్టోబర్ 12వ తేదీ (సోమవారం)న నిర్వహించనున్న రైతు నేస్తం కార్యక్రమం సందర్భంగా కలెక్టరేట్లో నిర్వహించే జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు స్పష్టం చేశారు.
ప్రజలు ఈ విషయాన్ని గమనించి తమ వినతులు, ఫిర్యాదులతో సోమవారం కలెక్టరేట్‌కు రావద్దని *కలెక్టర్* కోరారు.
అయితే డివిజన్ స్థాయి, మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని *కలెక్టర్* వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలు, వినతులను సంబంధిత డివిజన్, మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాల్లో సమర్పించుకోవచ్చని సూచించారు.