వార్త ముఖ్యాంశాలు
- *రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహణ* *మహిళా రైతుల భాగస్వామ్యానికి ప్రత్యేక చర్యలు* --జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రబీ పంటల ప్రణాళిక, పంటల సాగు విధానాలు, పంటల వైవిధ్యీకరణ, వ్యవసాయ నిర్వహణ పద్ధతులపై రైతులకు అవగాహన…
- ఈ మేరకు జిల్లా వ్యవసాయ అధికారి, సంబంధిత శాఖల అధికారులు, మండల స్థాయి అధికారులకు *కలెక్టర్* పలు కీలక సూచనలు జారీ చేశారు.
- జిల్లాలోని ప్రతి రైతు వేదికకు కనీసం 200 మంది రైతులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, సోమవారం ఉదయం 11 గంటల లోపు రైతులందరూ తమకు కేటాయించిన రైతు వేదికలకు చేరుకునేలా చూడాలని ఆదేశించారు.
*రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహణ*
*మహిళా రైతుల భాగస్వామ్యానికి ప్రత్యేక చర్యలు*
–జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా*
రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రబీ పంటల ప్రణాళిక, పంటల సాగు విధానాలు, పంటల వైవిధ్యీకరణ, వ్యవసాయ నిర్వహణ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు *తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి* రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్న నేపథ్యంలో, అక్టోబర్ 12వ తేదీన (సోమవారం) నిర్వహించనున్న రైతు నేస్తం కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని రైతు వేదికల్లో పకడ్బందీగా నిర్వహించనున్నట్లు *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ మేరకు జిల్లా వ్యవసాయ అధికారి, సంబంధిత శాఖల అధికారులు, మండల స్థాయి అధికారులకు *కలెక్టర్* పలు కీలక సూచనలు జారీ చేశారు.
జిల్లాలోని ప్రతి రైతు వేదికకు కనీసం 200 మంది రైతులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, సోమవారం ఉదయం 11 గంటల లోపు రైతులందరూ తమకు కేటాయించిన రైతు వేదికలకు చేరుకునేలా చూడాలని ఆదేశించారు.
ప్రతి రైతు వేదికలో మహిళా రైతులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని స్పష్టం చేశారు. స్వయం సహాయక సంఘాలు, గ్రామ సంఘాలు, సెర్ప్ సిబ్బంది, మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా మహిళా రైతులను కార్యక్రమానికి సమీకరించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిని ఆదేశించారు.
ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ, మార్కెటింగ్ శాఖ, పశుసంవర్ధక శాఖ అధికారులు తమ పరిధిలోని రైతులు, ఉద్యానవన రైతులు, పాడి పరిశ్రమ, పశుపోషణ రంగాలకు చెందిన రైతులు కార్యక్రమంలో పాల్గొనేలా క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వానాకాలం 2026లో ఎల్‌నినో పరిస్థితులపై అవగాహన కల్పించిన అనంతరం పంటల వైవిధ్యీకరణ, శాఖ సూచించిన వ్యవసాయ పద్ధతులను అనుసరించి ప్రయోజనం పొందిన ఇద్దరు ప్రగతిశీల రైతులను గుర్తించాలని సూచించారు.
సహజ వ్యవసాయం, వ్యవసాయ యాంత్రీకరణ, పప్పుధాన్యాల్లో ఆత్మనిర్భరత మిషన్ (MANP) వంటి పథకాల ద్వారా లబ్ధి పొందిన రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
జనగామ, ఘన్‌పూర్ (స్టేషన్) రెవెన్యూ డివిజన్లలో సంబంధిత ఆర్డీవోలు, మండలాల్లో మండల ప్రత్యేక అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతి రైతు వేదికకు ఒక మండల స్థాయి అధికారిని కేటాయించాలని సూచించారు.
ఈ రైతు నేస్తం కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని, రైతులకు ఎల్‌నినో పరిస్థితులు, రబీ పంటల ప్రణాళిక, అనువైన పంటల ఎంపిక, శాస్త్రీయ సాగు పద్ధతులపై అవగాహన కల్పించేలా అవసరమైన ఏర్పాట్లన్నీ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని వెల్లడించారు.