వార్త ముఖ్యాంశాలు
- *మిషన్ శక్తి కింద మహిళా సాధికారత జిల్లా కేంద్రంలో 6 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం* మిషన్ శక్తి పథకం కింద జనగామ జిల్లాలోని మహిళా సాధికారత జిల్లా కేంద్రం (డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ విమెన్)లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఆరు పోస్టుల భర్తీకి అర్హులైన…
- *భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు:* జిల్లా మిషన్ కో-ఆర్డినేటర్ – 1, జెండర్ స్పెషలిస్ట్ – 2, ఫైనాన్షియల్ లిటరసీలో స్పెషలిస్ట్ – 1, అకౌంట్స్ అసిస్టెంట్ – 1, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 1 పోస్టు ఉన్నాయన్నారు.
- *వయోపరిమితి:* 01.10.2026 నాటికి అభ్యర్థుల వయసు 21 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలన్నారు.
*మిషన్ శక్తి కింద మహిళా సాధికారత జిల్లా కేంద్రంలో 6 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం*
మిషన్ శక్తి పథకం కింద జనగామ జిల్లాలోని మహిళా సాధికారత జిల్లా కేంద్రం (డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ విమెన్)లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఆరు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
*భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు:* జిల్లా మిషన్ కో-ఆర్డినేటర్ – 1, జెండర్ స్పెషలిస్ట్ – 2, ఫైనాన్షియల్ లిటరసీలో స్పెషలిస్ట్ – 1, అకౌంట్స్ అసిస్టెంట్ – 1, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 1 పోస్టు ఉన్నాయన్నారు.
*వయోపరిమితి:* 01.10.2026 నాటికి అభ్యర్థుల వయసు 21 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుందన్నారు.
*ఎంపిక విధానం:* అభ్యర్థులకు అక్టోబర్ 15, గురువారం ఉదయం 10.00 గంటలకు నెగెటివ్ మార్కింగ్‌తో కూడిన రాత పరీక్ష నిర్వహిస్తారన్నారు. అదే రోజు మౌఖిక పరీక్ష నిర్వహించి, ఫలితాలను ప్రకటిస్తారన్నారు. మరుసటి రోజు నియామక ఉత్తర్వులు జారీ చేస్తారన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను తప్పనిసరిగా తీసుకురావాలన్నారు.
*దరఖాస్తుల స్వీకరణ:* నిర్ణీత నమూనాలో పూర్తి చేసిన దరఖాస్తులను అక్టోబర్ 9 నుంచి 14వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు జనగామ కలెక్టరేట్ కార్యాలయం (IDOC)లోని ఇన్‌వార్డ్ సెక్షన్‌లో సమర్పించాలన్నారు.
అదే విధంగా, ఆయా పోస్టులకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని *కలెక్టర్* స్పష్టం చేశారు.
*ఆన్లైన్ దరఖాస్తు లింక్:*
https://sites.google.com/view/dhew-jangaon-application
అలాగే, జనగామ జిల్లా అధికారిక వెబ్‌సైట్ https://jangaon.telangana.gov.in లో కూడా ఈ లింక్ అందుబాటులో ఉందని *కలెక్టర్* వెల్లడించారు.
ప్రస్తుతం మహిళా సాధికారత జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు, అనుభవం, పరీక్ష సిలబస్, దరఖాస్తు నమూనా, ఇతర నిబంధనల వివరాలను జనగామ జిల్లా అధికారిక వెబ్‌సైట్ https://jangaon.telangana.gov.in లో (లేదా) కలెక్టరేట్ కార్యాలయ నోటీసు బోర్డులో పరిశీలించాలని వెల్లడించారు.