వార్త ముఖ్యాంశాలు
- తానూర్: మండలంలోని కోలూరు, హంగిర్గ, హిపెనెల్లి గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభల్లో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాల్గొని పంజాబ్ ల్యాండ్స్ పేరుతో 22/ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
- సుమారు 2,500 ఎకరాల భూ సమస్యలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
- అర్హులైన రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తానూర్: మండలంలోని కోలూరు, హంగిర్గ, హిపెనెల్లి గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభల్లో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాల్గొని పంజాబ్ ల్యాండ్స్ పేరుతో 22/ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సుమారు 2,500 ఎకరాల భూ సమస్యలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అర్హులైన రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతులు పట్టా పత్రాలు, పాత రెవెన్యూ రికార్డులను అధికారులకు అందజేసి సహకరించాలని కోరారు. పొలం బాటల అభివృద్ధికి, రహదారుల నిర్మాణానికి చర్యలు చేపడతామని తెలిపారు.