రూ. 20 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం
దగదర్తి: మండలంలోని మనుబోలుపాడు గ్రామంలో ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమంలో భాగంగా గ్రామ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. సుమారు రూ. 20 లక్షల నిధులతో చేపట్టనున్న ఈ అభివృద్ధి పనులకు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని సహకారం అందించారు.
ఈ కార్యక్రమంలో దగదర్తి మండల టీడీపీ ఇన్‌చార్జ్ పమిడి రవికుమార్ చౌదరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సూచనల మేరకు గ్రామస్తులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని నాయకులు తెలిపారు. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాలుగోన్నారు
