Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కావలిలో జనసేన పార్టీలోకి భారీగా ముస్లిం మైనార్టీల చేరిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కావలిలో జనసేన పార్టీలోకి భారీగా ముస్లిం మైనార్టీల చేరిక

నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో జనసేన పార్టీకి మైనార్టీ వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. కావలి పట్టణ జనసేన నాయకులు సయ్యద్ సాజిద్, షేక్ రిహానా, విజయానంద్ లా ఆధ్వర్యంలో సుమారు 100 మందికి పైగా ముస్లిం మైనార్టీ మహిళలు, యువత జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరారు.
​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు శ్రీ మన్నెమాల సుకుమార్ రెడ్డి గారు పార్టీలో చేరిన మహిళలకు, యువతకు జనసేన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
​ఈ సందర్భంగా శ్రీ మన్నెమాల సుకుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ:
“జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, సమాజంలో మార్పు కోసం ఆయన పడుతున్న తపన చూసి అన్ని వర్గాల ప్రజలు పార్టీ వైపు అడుగులు వేస్తున్నారన్నారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి, అభివృద్ధికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. కావలి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలి” అని పిలుపునిచ్చారు.
​కార్యక్రమ నిర్వాహకులు సయ్యద్ సాజిద్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంపై నమ్మకంతోనే మైనార్టీ మహిళలు, యువత పెద్ద ఎత్తున పార్టీలో చేరారని, రాబోయే రోజుల్లో కావలి పట్టణంలో జనసేన పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
​ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద ఎత్తున మహిళలు, యువకులు పాల్గొన్నారు.

కావలిలో జనసేన పార్టీలోకి భారీగా ముస్లిం మైనార్టీల చేరిక

Leave a comment

Your email address will not be published. Required fields are marked *