వార్త ముఖ్యాంశాలు
- కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి అక్టోబర్ 9: జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో రైతుల చిరకాల కోరిక నెరవేరింది.
- పల్లె పండుగ 3.0 లో భాగంగా ఇర్రిపాక నుండి కాండ్రేగుల వరకు పొలాల మధ్య నుండి వెళ్లే 5.540 కిలోమీటర్ల తారు రోడ్డు నిర్మాణానికి 2 కోట్ల 65 లక్షల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి శంకుస్థాపకులుగా జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు,…
- ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, ఇర్రిపాక నుండి కాండ్రేగుల వెళ్లే ఈ రోడ్డు పూర్తిగా పొలాల మధ్య నుండి వెళుతుందని, పూర్తిగా రైతులకు ఉపయోగపడే రోడ్డని స్పష్టం చేశారు.
కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి అక్టోబర్ 9:
జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో రైతుల చిరకాల కోరిక నెరవేరింది. పల్లె పండుగ 3.0 లో భాగంగా ఇర్రిపాక నుండి కాండ్రేగుల వరకు పొలాల మధ్య నుండి వెళ్లే 5.540 కిలోమీటర్ల తారు రోడ్డు నిర్మాణానికి 2 కోట్ల 65 లక్షల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి శంకుస్థాపకులుగా జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, ఇర్రిపాక నుండి కాండ్రేగుల వెళ్లే ఈ రోడ్డు పూర్తిగా పొలాల మధ్య నుండి వెళుతుందని, పూర్తిగా రైతులకు ఉపయోగపడే రోడ్డని స్పష్టం చేశారు. ఈ రోడ్డు పూర్తిగా అధ్వానంగా మారి గోతులమయమైందని, దీంతో పంటలను తరలించేందుకు, ట్రాక్టర్లు, పంట కోత యంత్రాలు తీసుకెళ్లేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు.రైతుల కష్టాలను గుర్తించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి వెంటనే 2 కోట్ల 65 లక్షలు మంజూరు చేయించామని, ఈ రోడ్డు పూర్తయితే వందలాది ఎకరాల్లో పంటలు సాగు చేసే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, పంట రవాణా సులభమవుతుందని తెలిపారు. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.అనంతరం ఇర్రిపాక గ్రామంలో 172 మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. లేఔట్ గా విడదీసి అన్ని మౌలిక వసతులతో ఇళ్లు నిర్మించుకునేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అడపా భరత్, కన్నబాబు, రాష్ట్ర డైరెక్టర్ లు పోతుల మోహనరావు, కొత్త కొండబాబు, మారిశెట్టి భద్రం, క్లస్టర్ ఇంచార్జి బస్వా చినబాబు, పంచాయతీరాజ్ డి ఈ గంగాధరం, నీటి సంఘం చైర్మన్ జ్యోతుల ఈశ్వరరావు, తూము కుమార్, జ్యోతుల నాగబాబు, పంతం సత్యనారాయణ, జ్యోతుల సత్యమూర్తి, పంతం తమ్మి రాజు బాబు, ఎమ్మార్వో రమేష్, పంచాయతీ సెక్రెటరీ కోటీశ్వరరావు, వీఆర్వో వెంకట్రావు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ వినీత్ కూటమి నాయకులు, అధికారులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.