వార్త ముఖ్యాంశాలు
- అనంతసాగరం మండలం యాకర్లపాడు సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
- కారు టైరు పేలడంతో అదుపుతప్పిన కారు ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను బలంగా ఢీకొట్టింది.
- ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మహిళతో పాటు మరో వ్యక్తి మృతి చెందారు.
అనంతసాగరం మండలం యాకర్లపాడు సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు టైరు పేలడంతో అదుపుతప్పిన కారు ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మహిళతో పాటు మరో వ్యక్తి మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తిరుపతి నుంచి శ్రీశైలం దైవదర్శనానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.