వార్త ముఖ్యాంశాలు
- బీసీల రాజకీయ సాధికారతకు టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర స్పష్టం చేశారు.
- సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తుంటే వైసీపీ అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు.
- బీసీలకు న్యాయం జరుగుతుంటే వైసీపీకి ఎందుకంత అక్కసని నిలదీశారు.
బీసీల రాజకీయ సాధికారతకు టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తుంటే వైసీపీ అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు. బీసీలకు న్యాయం జరుగుతుంటే వైసీపీకి ఎందుకంత అక్కసని నిలదీశారు. స్థానిక ఎన్నికలను అడ్డుకోవడం బీసీల హక్కులను కాలరాయడమేనని విమర్శించారు.