వార్త ముఖ్యాంశాలు
- చిట్వేల్, అక్టోబర్ 9: చిట్వేల్ మండలంలో ప్రభుత్వ బంజరు భూముల ఆక్రమణలపై ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని, సమస్యలను ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరించడం సరికాదని సీపీఐ నాయకులు విమర్శించారు.
- ఈ నెల 9న భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మండల సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రైల్వేకోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య, తిప్పన ప్రసాద్, సామ గంగయ్య మాట్లాడారు.
- మైలపల్లి పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 999/1లో 15 ఎకరాలు, సర్వే నంబర్ 490/2లో 1.50 ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని మూడు నెలల క్రితం తహసీల్దార్ నరసింహరావుకు వినతిపత్రం ఇచ్చినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.ఈ విషయంపై వివరణ కోరగా, ప్రజా సమస్యల గురించి కార్యాలయానికి…
చిట్వేల్, అక్టోబర్ 9: చిట్వేల్ మండలంలో ప్రభుత్వ బంజరు భూముల ఆక్రమణలపై ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని, సమస్యలను ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరించడం సరికాదని సీపీఐ నాయకులు విమర్శించారు.
ఈ నెల 9న భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మండల సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రైల్వేకోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య, తిప్పన ప్రసాద్, సామ గంగయ్య మాట్లాడారు. మైలపల్లి పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 999/1లో 15 ఎకరాలు, సర్వే నంబర్ 490/2లో 1.50 ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని మూడు నెలల క్రితం తహసీల్దార్ నరసింహరావుకు వినతిపత్రం ఇచ్చినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.ఈ విషయంపై వివరణ కోరగా, ప్రజా సమస్యల గురించి కార్యాలయానికి వస్తే కేసులు పెడతామని తహసీల్దార్ బెదిరించినట్లు సీపీఐ నాయకులు పేర్కొన్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతామని స్పష్టం చేశారు.
ప్రభుత్వ బంజరు భూములను కాపాడి అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకుండా కేసులతో భయపెట్టడం వల్ల ప్రయోజనం లేదని, ప్రజా సమస్యలు పరిష్కారమైతేనే కార్యాలయాలకు వచ్చే వారి సంఖ్య తగ్గుతుందని అన్నారు. భూ సమస్యలపై అధికారులు స్పందించకపోతే బాధిత పేద ప్రజలను కలుపుకొని చిట్వేల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట భారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు పల్లెపాటి పెంచలయ్య, పల్లెపాటి మస్తానమ్మ పాల్గొన్నారు.