Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మహబూబాబాద్

గ్లోబల్ కేరళ మోడల్ స్కూల్‌లో బతుకమ్మ సంబరాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గ్లోబల్ కేరళ మోడల్ స్కూల్‌లో బతుకమ్మ సంబరాలు

విద్యార్థులు, ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం పాల్గొని సందడి

మరిపెడ: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని గ్లోబల్ కేరళ మోడల్ స్కూల్‌లో మొదటి రోజు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి, బతుకమ్మలను అందంగా పేర్చి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.

తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతిపై ప్రేమకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. పాఠశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం విద్యార్థులతో కలిసి వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడంతో పాటు పండుగల ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

విద్యార్థుల ఆటపాటలు, బతుకమ్మ పాటలతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. సంప్రదాయాలను గౌరవిస్తూ సంబరాలను నిర్వహించడం పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు.

గ్లోబల్ కేరళ మోడల్ స్కూల్‌లో బతుకమ్మ సంబరాలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *