వార్త ముఖ్యాంశాలు
- ఆత్మకూరు, పున్నమి: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణ సమీపంలోని జాతీయ రహదారి NH-67పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
- పొదలకూరు మండలం నేదురుమల్లి గ్రామానికి చెందిన తలపనేని రమేష్, శివూరి బాలకృష్ణ, వేమన గోపి తమ బంధువులకు ఆత్మకూరు ఆసుపత్రిలో ప్రసవం కావడంతో పరామర్శించి, ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు.
- ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో నెల్లూరు నుంచి బళ్లారి వెళ్తున్న లారీ వారి బైక్ను ఢీకొట్టింది.
ఆత్మకూరు, పున్నమి: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణ సమీపంలోని జాతీయ రహదారి NH-67పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. పొదలకూరు మండలం నేదురుమల్లి గ్రామానికి చెందిన తలపనేని రమేష్, శివూరి బాలకృష్ణ, వేమన గోపి తమ బంధువులకు ఆత్మకూరు ఆసుపత్రిలో ప్రసవం కావడంతో పరామర్శించి, ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో నెల్లూరు నుంచి బళ్లారి వెళ్తున్న లారీ వారి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన బాలకృష్ణ మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. సమాచారం అందుకున్న సీఐ గంగాధర్, ఎస్ఐ జంపాని కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.