Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

ప్రతి ఇంటికి సోలార్ ప్రజలకి వినియోగించడం మా లక్ష్యం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ప్రతి ఇంటికి సోలార్ ప్రజలకి వినియోగించడం మా లక్ష్యం

ప్రతి ఇంటికీ రూఫ్‌టాప్ సోలార్‌.. ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యం.

-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు.

గొల్లపూడిలో పీఎం సూర్య ఘర్‌ ఉచిత విద్యుత్ పథకంపై సేవా సేతు అభియాన్‌.

సబ్సిడీలు, దరఖాస్తులు, బ్యాంకు రుణాలపై ప్రజలకు అవగాహన.

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, అక్టోబర్ 8:

ప్రతి ఇంటికీ రూఫ్‌టాప్ సోలార్‌ విద్యుత్‌ను చేరువ చేసి, విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకునేలా ప్రజలను ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్య ఘర్‌ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని అమలు చేస్తోందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు పేర్కొన్నారు.

సౌర విద్యుత్ వినియోగంపై ప్రజల్లో అవగాహనప్రతి ఇంటికీ రూఫ్‌టాప్ సోలార్‌.. ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యం.

-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు.

గొల్లపూడిలో పీఎం సూర్య ఘర్‌ ఉచిత విద్యుత్ పథకంపై సేవా సేతు అభియాన్‌.

సబ్సిడీలు, దరఖాస్తులు, బ్యాంకు రుణాలపై ప్రజలకు అవగాహన.

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, అక్టోబర్ 8:

ప్రతి ఇంటికీ రూఫ్‌టాప్ సోలార్‌ విద్యుత్‌ను చేరువ చేసి, విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకునేలా ప్రజలను ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్య ఘర్‌ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని అమలు చేస్తోందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు పేర్కొన్నారు.

సౌర విద్యుత్ వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు చేపట్టిన సేవా సేతు అభియాన్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు పాల్గొన్నారు.

ఒకే చోట అన్ని సేవలు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ సేవా సేతు అభియాన్‌ ద్వారా రూఫ్‌టాప్ సోలార్‌ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలనుకునే కుటుంబాలకు పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం, ప్రభుత్వ సబ్సిడీలు, ప్రోత్సాహకాలు, బ్యాంకు రుణ సదుపాయాలపై అవగాహన కల్పిస్తున్నారన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తులకు అవసరమైన సహాయం అందించడంతో పాటు, సోలార్‌ ప్యానెళ్ల ఏర్పాటుపై ప్రజలకు ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు మార్గదర్శకత్వం అందిస్తున్నారన్నారు.

విద్యుత్ బిల్లుల తగ్గింపునకు సోలార్‌ దోహదం

ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్‌ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా సంప్రదాయ విద్యుత్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడంతో పాటు, విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా వివరించారు. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడవచ్చని తెలిపారు.

ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, ఇతర ప్రయోజనాలపై సరైన అవగాహన కలిగి ఉండి, అర్హులైన కుటుంబాలు ఈ పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు. స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని ప్రజలకు చేరువ చేయడంలో ఇటువంటి అవగాహన కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

అక్టోబర్ 17 వరకు సేవా సేతు అభియాన్‌

పీఎం సూర్య ఘర్‌ ముఫ్త్ బిజిలీ యోజనకు సంబంధించి సేవా సేతు అభియాన్‌ 2026 సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహించనున్నారు. ప్రజలు తమ సమీపంలోని శిబిరాలను సంప్రదించి పథకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడంతో పాటు, రూఫ్‌టాప్ సోలార్‌ ఏర్పాటుకు అవసరమైన మార్గదర్శకత్వం పొందాలని నిర్వాహకులు సూచించారు.

మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి అక్కల రామ్మోహన్ రావు గాంధీ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావు గారు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

#PMSuryaGhar #MuftBijliYojana #SevaSetuh పెంపొందించేందుకు చేపట్టిన సేవా సేతు అభియాన్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు పాల్గొన్నారు.

ఒకే చోట అన్ని సేవలు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ సేవా సేతు అభియాన్‌ ద్వారా రూఫ్‌టాప్ సోలార్‌ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలనుకునే కుటుంబాలకు పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం, ప్రభుత్వ సబ్సిడీలు, ప్రోత్సాహకాలు, బ్యాంకు రుణ సదుపాయాలపై అవగాహన కల్పిస్తున్నారన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తులకు అవసరమైన సహాయం అందించడంతో పాటు, సోలార్‌ ప్యానెళ్ల ఏర్పాటుపై ప్రజలకు ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు మార్గదర్శకత్వం అందిస్తున్నారన్నారు.

విద్యుత్ బిల్లుల తగ్గింపునకు సోలార్‌ దోహదం

ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్‌ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా సంప్రదాయ విద్యుత్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడంతో పాటు, విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా వివరించారు. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడవచ్చని తెలిపారు.

ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, ఇతర ప్రయోజనాలపై సరైన అవగాహన కలిగి ఉండి, అర్హులైన కుటుంబాలు ఈ పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు. స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని ప్రజలకు చేరువ చేయడంలో ఇటువంటి అవగాహన కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

అక్టోబర్ 17 వరకు సేవా సేతు అభియాన్‌

పీఎం సూర్య ఘర్‌ ముఫ్త్ బిజిలీ యోజనకు సంబంధించి సేవా సేతు అభియాన్‌ 2026 సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహించనున్నారు. ప్రజలు తమ సమీపంలోని శిబిరాలను సంప్రదించి పథకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడంతో పాటు, రూఫ్‌టాప్ సోలార్‌ ఏర్పాటుకు అవసరమైన మార్గదర్శకత్వం పొందాలని నిర్వాహకులు సూచించారు.

మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి అక్కల రామ్మోహన్ రావు గాంధీ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావు గారు, కూటమి నాయకులు పాల్గొన్న

ప్రతి ఇంటికి సోలార్ ప్రజలకి వినియోగించడం మా లక్ష్యం

ప్రతి ఇంటికి సోలార్ ప్రజలకి వినియోగించడం మా లక్ష్యం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *