వార్త ముఖ్యాంశాలు
- కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 8(పున్నమి న్యూస్): కరప కాశీ వారాహి అమ్మవారి ఆలయం మొదలు కొవ్వూరు ఆలయం వరకు దేవాదాయ శాఖ అనుసరిస్తున్న తీరు చూస్తుంటే భక్తుల రక్తం మరుగుతోంది.
- లాబీయింగ్ ముందు మోకరిల్లిన నిబంధనలు తీవ్ర వివాదాలు, ఆరోపణలు వెల్లువెత్తడంతో కరప శ్రీ కాశీ వారాహి మాత దేవాలయాన్ని అధికారులు సీజ్ చేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
- అంతలోనే ఏ మంత్రదండం పనిచేసిందో కానీ, అధికార పార్టీ నేతల నుంచి పైరవీల హోరు మొదలైంది.
కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 8(పున్నమి న్యూస్):
కరప కాశీ వారాహి అమ్మవారి ఆలయం మొదలు కొవ్వూరు ఆలయం వరకు దేవాదాయ శాఖ అనుసరిస్తున్న తీరు చూస్తుంటే భక్తుల రక్తం మరుగుతోంది.
లాబీయింగ్ ముందు మోకరిల్లిన నిబంధనలు
తీవ్ర వివాదాలు, ఆరోపణలు వెల్లువెత్తడంతో కరప శ్రీ కాశీ వారాహి మాత దేవాలయాన్ని అధికారులు సీజ్ చేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అంతలోనే ఏ మంత్రదండం పనిచేసిందో కానీ, అధికార పార్టీ నేతల నుంచి పైరవీల హోరు మొదలైంది. వెనుక సీట్లలో కూర్చుని నడిపిన రాజకీయ చక్రం దెబ్బకు శాఖ నిబంధనలు గాల్లో కలిసిపోయాయి. ఎలాంటి పారదర్శకత లేకుండా, గుట్టుచప్పుడు కాకుండా ఆలయ తాళాలను తిరిగి చిక్కాల దొరబాబు చేతికే అప్పగించారు. సామాన్యురాలు పెట్టిన గుడిపై కన్నెర్ర చేసే అధికారులు, రాజకీయ అండదండలు ఉన్న బడా బాబుల ముందు ఎందుకు సాష్టాంగపడ్డారన్నది ఇప్పుడు సంచలనంగా మారింది.
కొవ్వూరు ఆలయం కోట్ల ఆదాయం మాయం?
కరపలో సాగిన రాజకీయ డ్రామా ఇప్పుడు కొవ్వూరు వారాహి అమ్మవారి ఆలయానికి పాకుతుందా…?. సామాన్య మహిళ లక్ష్మీ ప్రసన్న అహర్నిశలు శ్రమించి ప్రతిష్టించిన కొవ్వూరు వారాహి ఆలయాన్ని చేజిక్కించుకొని కొంతమంది పెద్దలు దేవాదాయ అధికారులు పెద్దలు వ్యూహం రచించారు. కొంతకాలంగా హుండీ కానుకలు, పూజల రూపంలో కొవ్వూరు గుడికి వచ్చిన కోట్ల రూపాయల ఆదాయం ఎక్కడికి పోయింది? ఆ నిధులపై ఇప్పటివరకు దేవాదాయ శాఖ లెక్కలు ఎందుకు బయటపెట్టలేదు? అధికారిక పర్యవేక్షణ పేరుతో ఆ డబ్బును ఎవరి జేబుల్లోకి మళ్లించారనేది తీవ్ర దుమారం రేపుతోంది.
*సామాన్యురాలికి కన్నీళ్లు.. పెత్తందార్లకు పీఠాలా?*
చిన్న గుడిని నడిపే సామాన్యురాలిపై పెత్తనం చెలాయిస్తూ, కోట్ల ఆదాయం ఉన్న గుడిని దొడ్డిదారిన ప్రైవేటు వ్యక్తుల పరం చేయడానికి తెరవెనుక పావులు కదుపుతున్నారు. కరపలో ఒక న్యాయం, కొవ్వూరులో మరో న్యాయమా అంటూ భక్తజనం ఆగ్రహోదగ్రులవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు నిద్రలేచి అందరికీ ఒక న్యాయమే చేస్తారా లేక ప్రజా ప్రతినిధుల మాటలకే తల ఒగ్గుతారా.. వేచి చూడాలి.. నిధుల గోల్‌మాల్‌పై సమగ్ర విచారణ జరపకపోతే దేవాదాయ శాఖ కార్యాలయాలను ముట్టడిస్తామని స్థానికులు భక్తులు హెచ్చరిస్తున్నారు. ప్రజా ప్రతినిధుల చలవో భక్తుల విన్నపాలో తెలియదు గాని కరప వారాహి అమ్మవారు నిర్వహణ ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు కు అప్పగిస్తున్నారు అయితే గత కొద్ది కాలంగా అప్పులు చేసి గుడి కట్టానని తన వద్ద ఒక్క రూపాయి కూడా లేదంటూ వచ్చిన ప్రచారం చూస్తుంటే రాబోయే రోజుల్లో మరి గుడిని ఏ విధంగా నిర్వహించాలని అనుకుంటున్నారు అనేది ప్రశ్నార్థకం … అయితే రాబోయే రోజుల్లో గుడి నిర్వహణ రాజకీయ నాయకుల అండుదండలతో నడుస్తుందా లేదా భక్తులు ఇచ్చే కానుకల తో నడుస్తుందా.. తెలియాల్సి ఉంది…?.. ఈ విషయంపై దేవాదాయ శాఖ అధికారులు నోరు మెదుపుతారా లేక మౌనాన్ని పాటిస్తారా వేచి చూడాల్సిందేమో…? ఇక్కడ భక్తులు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు అటు చిక్కాల వారునిర్వహించిన లేక దేవాదాయ శాఖ అధికారులు నిర్వహించిన అమ్మవారికి పూజలు జరుగుతాయి ఆ చిన్న విషయాన్ని మరిచిన భక్తులు.. కానీ కొంతమంది వ్యక్తులు తమ స్వార్థం కోసం భక్తులను వాడుకుంటూ రాజకీయం చేయడం కడుసోచనీయం..