Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కాకినాడ

గోదావరి పుష్కరాలు–2027 పై రాష్ట్ర డీజీపీ సమీక్ష

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
గోదావరి పుష్కరాలు–2027 పై రాష్ట్ర డీజీపీ సమీక్ష

వార్త ముఖ్యాంశాలు

  • తూర్పుగోదావరి జిల్లా,రాజమహేంద్రవరం,అక్టోబర్ 8(పున్నమి న్యూస్): తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో రానున్న పుష్కరాలు–2027 పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్.
  • అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
  • జిల్లాకు విచ్చేసిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్.

తూర్పుగోదావరి జిల్లా,రాజమహేంద్రవరం,అక్టోబర్ 8(పున్నమి న్యూస్):
తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో రానున్న పుష్కరాలు–2027 పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
జిల్లాకు విచ్చేసిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్. అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్) ఎన్. మధుసూదన్ రెడ్డి ఐపీఎస్.ఏలూరు రేంజ్ ఐజీ జీ.వి.జి. అశోక్ కుమార్ ఐపీఎస్.తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఐపీఎస్.మరియు ఇతర పోలీసు అధికారులు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్ఛాలు అందజేశారు.
ఈ సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఐఏఎస్.నారాయణ భరత్ గుప్తా ఐఏఎస్ , జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్ ఐఏఎస్ , ఉమెన్ సేఫ్టీ మరియు రైల్వే ఐ జి బి రాజకుమారి ఐపీఎస్ ,సిహెచ్ శ్రీకాంత్ ఐపీఎస్ ఐజీ టెక్నికల్ సర్వీస్ ., పుష్కరాల ప్రత్యేక అధికారి, సీఐడీ ఎస్పీ రెడ్డి గంగాధర్ ఐపీఎస్., కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపీఎస్., ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్., కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఐపీఎస్., పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి ఐపీఎస్ , పోలవరం జిల్లా ఎస్పీ కె. చక్రవర్తి ఐపీఎస్., కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్., తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) పాటిల్ దేవరాజ్ మనీష్ ఐపీఎస్ తదితర అధికారులు పాల్గొన్నారు.

పుష్కరాలు–2027పై డీజీపీ కీలక సూచనలు

పుష్కరాల నిర్వహణలో అన్ని శాఖల మధ్య సమన్వయం కోసం మల్టిపుల్ మైక్రో టీమ్స్ ఏర్పాటు చేసి, వాటి పనితీరును నిరంతరం పర్యవేక్షించాలి.
మైక్రో టీమ్స్ పురోగతిపై వారానికి ఒకసారి సమీక్షలు నిర్వహించి, అవసరమైన మార్గదర్శకాలు అందించాలి.
పుష్కరాల సమయంలో ట్రాఫిక్ నిర్వహణకు సమగ్ర ట్రాఫిక్, ఎమర్జెన్సీ రూట్ ప్లాన్ సిద్ధం చేయాలి. దివాన్‌చెరువు ఫ్లైఓవర్ల పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయాలి.
ఏ డి బి రోడ్డు ,జొన్నాడ బ్రిడ్జి ,ఉండ్రాజవరం బ్రిడ్జి ,చించినాడ బ్రిడ్జి, కత్తిపూడి నుండి ఒంగోలు వరకు ఉన్నటువంటి కోస్టల్ క్యారిడారు వంటి రహదారులన్నీ ప్రస్తుతం ఎంతవరకు పనులు కొనసాగుతున్నాయో వాటిని పర్యవేక్షించాలని సూచించారు
వివిధ జిల్లాల నుంచి పుష్కరాలకు వచ్చే ఆర్టీసీ బస్సులు ఏ ఏ పుష్కర్ నగర్ లకు వెళ్లాలి భక్తులు ఏ ఏ ఘాట్లకు వెళ్లాలి అనే సూక్ష్మస్థాయి ప్రణాళిక రూపొందించాలి.
జాతీయ రహదారుల ఎన్ హెచ్-16 మరియు ఏ డి బి రోడ్ పై భారీ వాహనాల రాకపోకలు, పార్కింగ్ కోసం ముందుగానే తగిన ప్రదేశాలను (హోల్డింగ్ ఏరియాస్ )గుర్తించి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి.
పుష్కరాలు జరిగే అన్ని జిల్లాలలో ఉన్న ప్రసిద్ధ ఆలయాలను గుర్తించి భక్తులకు ఎటువంటి అంతరాయం లేకుండా దర్శనం పూర్తయ్యే విధంగా కంపార్ట్మెంట్ విధానాన్ని అనుసరించి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షణ జరిగే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి
ఎన్ సి సి,ఎన్ ఏస్ ఏస్ సీనియర్ స్కూల్ విద్యార్థులు, వాలంటీర్లకు ముందస్తు శిక్షణ అందించి వారి సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలి.
డ్రోన్లు ,సీసీ కెమెరాలు ,ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ వంటి సాంకేతిక వ్యవస్థ మరియు కమ్యూనికేషన్ విభాగం కోసం రాష్ట్రస్థాయి లో సమావేశం ఏర్పాటు చేసు కొని సరైన ప్రణాళిక రూపొందించాలి.
ఇంటిగ్రేటెడ్ డ్రోన్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలి. దీనిలో భాగంగా ఏపీ డ్రోన్ కార్పొరేషన్ తో సమన్వయం చేసుకోవాలి
స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక గుర్తింపు కార్డులు, ప్రవేశ మార్గాలు, అవసరమైన సౌకర్యాలపై ముందస్తు ప్రణాళిక రూపొందించాలి.
పుష్కర సమయంలో ఎన్ని ఆటోలు ఏ ఏ రూట్లలో తిరగాలి కనీస ధర ఎంత ఉండాలి , ఆటోలకు మరియు డ్రైవర్లకు సరైన గుర్తింపు పత్రాలు ఉండే విధంగా ప్రణాళిక రూపొందించాలి.
నిత్యావసర వస్తువుల రవాణా, ఆసుపత్రికి వెళ్లేటువంటి రోగుల విషయంలో, మరియు ఉద్యోగస్తులకు ఎటువంటి అంతరాయం లేకుండా ప్రణాళిక రూపొందించాలి.
పుష్కర్ నగర్లలో లైటింగ్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ , అంతర్గత ట్రాఫిక్ నిర్వహ నకు కోసం కుంట (సి యూ ఎమ్ టి ఏ) టీమును సరైన ప్రణాళిక రూపొందింఛి ఇవ్వమని చెప్పాలి.
ఘాట్ల అభివృద్ధి, సివిల్ వర్క్స్, మౌలిక వసతులు, పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనం నిర్మాణ పనులను నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేయాలి.
పుష్కరాలు–2027ను భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన, స్మరణీయమైన ఆధ్యాత్మిక అనుభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని డీజీపీ సూచించారు.పుష్కరాలు జరిగే ఇతర జిల్లాల అధికారులు కూడా ఇదే విధమైన సమగ్ర కార్యాచరణతో నిర్ణీత కాలపరిమితిలో ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *