Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

రెవెన్యూ దరఖాస్తులు పెండింగ్‌ ఉండొద్దు జాప్యం లేకుండా పరిష్కరించాలి : కలెక్టర్‌

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రెవెన్యూ దరఖాస్తులు పెండింగ్‌ ఉండొద్దు జాప్యం లేకుండా పరిష్కరించాలి : కలెక్టర్‌

వార్త ముఖ్యాంశాలు

  • నంద్యాల: రెవెన్యూ శాఖకు సంబంధించిన దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా క్షేత్రస్థాయిలోనే సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్‌ జి.
  • రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు.
  • బుధవారం మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు.22ఏ, ఇనాం పట్టాలు, మ్యుటేషన్లు, సర్వే సర్టిఫికెట్ల దరఖాస్తులను జాప్యం లేకుండా పరిష్కరించాలని సూచించారు.

నంద్యాల: రెవెన్యూ శాఖకు సంబంధించిన దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా క్షేత్రస్థాయిలోనే సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్‌ జి. రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. బుధవారం మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు.22ఏ, ఇనాం పట్టాలు, మ్యుటేషన్లు, సర్వే సర్టిఫికెట్ల దరఖాస్తులను జాప్యం లేకుండా పరిష్కరించాలని సూచించారు. ప్రజలు ఒకే సమస్యపై పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకుండా అధికారులు బాధ్యతతో పనిచేయాలని అన్నారు. పెండింగ్‌ దరఖాస్తులపై ప్రతిరోజూ పర్యవేక్షణ చేపట్టి, అవసరమైన ఫైళ్లను వెంటనే పైస్థాయికి పంపాలని ఆదేశించారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కుల, నో డ్యూస్‌ ధ్రువీకరణ పత్రాలను నిబంధనల మేరకు సత్వరం జారీ చేయాలని సూచించారు. పీజీఆర్ఎస్‌ దరఖాస్తులపై దరఖాస్తుదారులతో స్వయంగా మాట్లాడి సమస్య పరిష్కార స్థితిని తెలుసుకోవడంతో పాటు ప్రజల సంతృప్తిని నిర్ధారించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌, సబ్‌ కలెక్టర్‌ మనీషా, డీఆర్వో రామునాయక్‌, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *