Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

*మ‌న‌మిత్ర ద్వారా కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాలు**మొబైల్ ఫోన్ ద్వారానే డౌన్లోడు చేసుకునే స‌దుపాయం**రీ ఇష్యూయెన్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ స‌ర్వీసు అందుబాటులో ఉంద‌న్న ఆర్టీజీఎస్‌*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • అమ‌రావ‌తి: మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా పౌరులు త‌మ కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాలు పొందే స‌దుపాయాన్ని క‌ల్పించిన‌ట్లు రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ అధికారులు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.
  • పౌరులు త‌మ కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాల‌ను త‌మ‌కు కావాల్సిన‌ప్పుడు ఏ ప్ర‌భుత్వ కార్యాలయానికి వెళ్ల‌న‌వ‌స‌రం లేకుండా తామున్న చోటు నుంచే త‌మ మొబైల్‌ఫోన్ ద్వారా డౌన్‌లోడు చేసుకోవ‌చ్చ‌ని ఆర్టీజీఎస్ తెలిపింది.
  • మ‌న‌మిత్రలోని రెవెన్యూ సేవ‌ల విభాగంలో పౌరులు రీ ఇష్యూయెన్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ స‌ర్టిఫికెట్స్ విభాగాన్ని ఎంపిక చేసుకుని అందులో త‌మ ఆధార్ నంబ‌రు పొందుప‌రిచి ఓటీపీ పొందాలి.

అమ‌రావ‌తి: మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా పౌరులు త‌మ కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాలు పొందే స‌దుపాయాన్ని క‌ల్పించిన‌ట్లు రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ అధికారులు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. పౌరులు త‌మ కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాల‌ను త‌మ‌కు కావాల్సిన‌ప్పుడు ఏ ప్ర‌భుత్వ కార్యాలయానికి వెళ్ల‌న‌వ‌స‌రం లేకుండా తామున్న చోటు నుంచే త‌మ మొబైల్‌ఫోన్ ద్వారా డౌన్‌లోడు చేసుకోవ‌చ్చ‌ని ఆర్టీజీఎస్ తెలిపింది. మ‌న‌మిత్రలోని రెవెన్యూ సేవ‌ల విభాగంలో పౌరులు రీ ఇష్యూయెన్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ స‌ర్టిఫికెట్స్ విభాగాన్ని ఎంపిక చేసుకుని అందులో త‌మ ఆధార్ నంబ‌రు పొందుప‌రిచి ఓటీపీ పొందాలి. ఈ ఓటీపి అందులో న‌మోదు చేసిన త‌ర్వాత కొన్ని వివ‌రాల‌ను నింపాలి. త‌ర్వాత కుల ధృవీక‌ర‌ణ ప‌త్రం పొంద‌డానికి కావాల్సిన రూ.40ల రుసుమును వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారానే చెల్లించ‌వ‌చ్చు. ఒక‌సారి చెల్లింపు అయిన త‌ర్వాతు వాట్సాప్‌లో మీ కుల ధృవీక‌ర‌ణ ప‌త్రం డౌన్లోడు చేసుకోవ‌చ్చు. ఇప్ప‌టికే కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాలు జారీ అయిన వారు త‌మ కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాల‌ను వాట్సాప్ ద్వారా త‌మ‌కు కావాల్సిన స‌మ‌యంలో కావాల్సిన చోట డౌన్లోడు చేసుకోవ‌చ్చు. ప్ర‌తి సారీ కుల ధృవీక‌ర‌ణ ప‌త్రం కోసం రెవెన్యూ కార్యాల‌యాలు, స్వ‌ర్ణ గ్రామ‌, స్వ‌ర్ణ వార్డు స‌చివాల‌యాలు, మీ సేవా కేంద్రాల చుట్టూ తిర‌గాల్సిన అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ఈ స‌దుపాయం ఇప్ప‌టిక కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాలు పొందిన‌వారికి క‌ల్పిస్తున్నామ‌ని త్వ‌ర‌లో మ‌న‌మిత్ర ద్వారా కొత్త‌గా కుల ధృవీక‌ర‌ణ‌కు ద‌ర‌ఖాస్తు చేసుకుని పొందే స‌దుపాయం కూడా క‌ల్పించ‌నున్న‌ట్లు ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు. *ఇలా ఉప‌యోగించాలి*1: మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ నంబ‌రు 9552300009 కు హాయ్ అని మెసేజ్ పంపాలి2:సేవ‌ను ఎంచుకోండి అనే అప్ఫ‌న్ ఎంపిక చేసుకోవాలి3: రెవెన్యూ సేవ‌ల ఆప్ష‌న్ ఎంపిక చేసుకోవాలి4: రీ-ఇష్యూయెన్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ స‌ర్టిఫికెట్లు ఆప్ష‌న్ ఎంపిక చేసుకోవాలి5: మీ ఆధార్ నంబ‌రు టైపు చేయాలి6: మీ మొబైల్‌కు వ‌చ్చిన ఓటీపీని ఓటీవీ అడిగిన చోట టైపు చేయాలి7: ఆధార్ డెమోగ్రాఫిక్స్ రివ్యూలో అడిగిన వివరాలు పొందుపరచాలి8: కుల ధృవీక‌ర‌ణ ప‌త్రం పొంద‌డానికి రూ.40 రుసుం చెల్లించాలి9: ఈ డ‌బ్బు చెల్లించ‌డానికి ఉన్న పేమెంట్ గేట్ వే ద్వారా చెల్లించాలి10: మీ కుల ధృవీక‌ర‌ణ ప‌త్రం పీడీఎఫ్ డౌన్లోడు వ‌స్తుంది11: దాన్ని మీరు ప్రింట్ లేదా డౌన్లోడు చేసుకోవ‌చ్చు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *