Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

నరేంద్రపురంలో ఆయుష్మాన్ మందిర్ ప్రారంభించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • పి.
  • గన్షవరం నుండి పున్నమి ప్రతినిధి అక్టోబర్ 7.డా.బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా,పి.గన్నవరం మండలం నరేంద్రపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్–విలేజ్ హెల్త్ క్లినిక్‌ను అక్టోబర్ 6 వ తేది సాయంత్రం 4 గంటలకు గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.
  • రాష్ట్రవ్యాప్తంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్–విలేజ్ హెల్త్ క్లినిక్‌లను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వర్చువల్‌గా ప్రారంభించారని తెలిపారు.

పి. గన్షవరం నుండి పున్నమి ప్రతినిధి అక్టోబర్ 7.డా.బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా,పి.గన్నవరం మండలం నరేంద్రపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్–విలేజ్ హెల్త్ క్లినిక్‌ను అక్టోబర్ 6 వ తేది సాయంత్రం 4 గంటలకు గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. రాష్ట్రవ్యాప్తంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్–విలేజ్ హెల్త్ క్లినిక్‌లను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వర్చువల్‌గా ప్రారంభించారని తెలిపారు. ఇందులో భాగంగా అమలాపురం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు తాను, అమలాపురం ఎమ్మెల్యే అయితబత్తుల ఆనందరావు పాల్గొన్నట్లు పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో విలేజ్ హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నరేంద్రపురంలో ఈ క్లినిక్ అందుబాటులోకి రావడంతో స్థానిక ప్రజలకు ప్రాథమిక వైద్యం గ్రామంలోనే అందుబాటులోకి వస్తుందన్నారు.ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న కో లోకేటెడ్ పీహెచ్‌సీ ఏర్పాటుకు సంబంధించి, తాత్కాలికంగా ఈ కేంద్రం ద్వారా వైద్య సేవలను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. త్వరలోనే నరేంద్రపురంలో పూర్తిస్థాయి పీహెచ్‌సీ అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తానని తెలియజేసారు
ఈ కార్యక్రమంలో. పి గన్నవరం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్చార్జ్ మోకా ఆనంద్ సాగర్ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్య సిబ్బంది, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *