వార్త ముఖ్యాంశాలు
- 🏭 శ్రీ సిటీ బాయిలర్ పేలుడు ఘటన 👉శ్రీ సిటీ పరిధిలోని టి.ఐ.
- హెల్త్ కేర్ పరిశ్రమలో జరిగిన విషాదకర బాయిలర్ పేలుడు ఘటనలో మృతి చెందిన ఐదుగురు కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయింది.
- 🔷మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఇచ్చిన హామీ మేరకు నగదు జమ చేశారు.
🏭 శ్రీ సిటీ బాయిలర్ పేలుడు ఘటన
👉శ్రీ సిటీ పరిధిలోని టి.ఐ. హెల్త్ కేర్ పరిశ్రమలో జరిగిన విషాదకర బాయిలర్ పేలుడు ఘటనలో మృతి చెందిన ఐదుగురు కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయింది.
🔷మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఇచ్చిన హామీ మేరకు నగదు జమ చేశారు.
👉ఈ ప్రమాదంలో చిన్న మస్తాన్ (చెరివి), వాసు (తడ), మోహన్ (నాయుడుకుప్పం), రమేష్ (మాదరపాకం), గౌరబ్ రాయ్ (బెంగాల్) మృతి చెందారు.
👉ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, శ్రీ సిటీ ఎండీ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. మృతుల అంత్యక్రియలకు కూడా తక్షణ ఆర్థిక సహాయం అందించారు.
🔷బాధిత కుటుంబాలను స్వయంగా కలిసి వారి పరిస్థితులను తెలుసుకున్న కలెక్టర్, పరిహారం విషయంలో ఇచ్చిన హామీని అమలు చేశారు.
🙏 బాధిత కుటుంబాలకు అండగా జిల్లా యంత్రాంగం
🔷పిల్లల భవిష్యత్తు, కుటుంబ సంక్షేమం కోసం పరిహారపు నగదును సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.