Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

రూ.1.16 కోట్లతో తారు రోడ్డు నిర్మాణం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రూ.1.16 కోట్లతో తారు రోడ్డు నిర్మాణం

వార్త ముఖ్యాంశాలు

  • రైల్వేకోడూరు: నియోజకవర్గంలోని అనంతరాజుపేట పంచాయతీలో రూ.1.16 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన తారు రోడ్డును ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ప్రారంభించారు.
  • పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో NABARD–RIDF XXX పథకం కింద ఈ రహదారి నిర్మాణాన్ని చేపట్టారు.
  • సీబీ రోడ్డు వద్ద 83/0 కిలోమీటర్ నుంచి తూర్పపల్లి ఎస్టీ కాలనీ వరకు రహదారిని నిర్మించారు.

రైల్వేకోడూరు: నియోజకవర్గంలోని అనంతరాజుపేట పంచాయతీలో రూ.1.16 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన తారు రోడ్డును ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ప్రారంభించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో NABARD–RIDF XXX పథకం కింద ఈ రహదారి నిర్మాణాన్ని చేపట్టారు.

సీబీ రోడ్డు వద్ద 83/0 కిలోమీటర్ నుంచి తూర్పపల్లి ఎస్టీ కాలనీ వరకు రహదారిని నిర్మించారు. సరైన రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీవాసులకు ఈ రహదారి అందుబాటులోకి రావడంతో రవాణా సమస్యలు తగ్గనున్నాయి.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాల మెరుగుదలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. మిగిలిన రహదారుల అభివృద్ధికి కూడా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *