Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మహబూబాబాద్

కురవిలో ‘అక్రమ పట్టాల’ కలకలం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
కురవిలో ‘అక్రమ పట్టాల’ కలకలం

వార్త ముఖ్యాంశాలు

  • •ఎరుకల కుటుంబంపై దౌర్జన్యాలా..?
  • •కురవిలో భూదందా ఆరోపణలు..
  • బాధితులపై దౌర్జన్యాలా?!

•ఎరుకల కుటుంబంపై దౌర్జన్యాలా..?
•కురవిలో భూదందా ఆరోపణలు.. బాధితులపై దౌర్జన్యాలా?!
•భూమి పంచాయితీపై భగ్గుమన్న బీఎస్పీ..!
••ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు పెట్టాలి.
మహబూబాబాద్ జిల్లా విలేకరి: కురవి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని 1వ వార్డులో ప్రభుత్వ భూమి స్థలానికి సంబంధించి అక్రమ పట్టా ఆరోపణలు, నివాస గృహాల మధ్య పెట్రోల్ పదార్థాలతో భూ షెడ్లు చేయడం, ప్రశ్నించిన బాధితులను కులం పేరుతో దూషిస్తూ దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని బీఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దార్ల శివరాజ్ డిమాండ్ చేశారు.
కురవికి చెందిన బాధితుడు నిమ్మశెట్టి వెంకన్న, ఆయన కుటుంబ సభ్యులు తమపై జరుగుతున్న అన్యాయాన్ని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి దార్ల శివరాజ్‌కు వివరించారు. బాధితులు అందించిన ఆధారాలు, రికార్డులను పరిశీలించిన అనంతరం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం ఎదుట బాధితులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా దార్ల శివరాజ్ మాట్లాడుతూ.. ఎరుకల సామాజిక వర్గానికి చెందిన అమాయకులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్న తల్లారి వీరన్న, తల్లారి లక్ష్మీనారాయణ, తాతూరి సంతోష్, చిలుముల సంతోష్, చిలుముల శ్రీకాంత్ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులను కులం పేరుతో దూషించి, అవమానించి, దాడులు చేయడం తీవ్రంగా ఖండించాల్సిన అంశమన్నారు.
సర్వే నంబర్ 852పై సమగ్ర విచారణ చేయాలి:
కురవిలోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 852కు సంబంధించి పూర్తి లింక్ పత్రాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు, హక్కులు, స్వాధీనం తదితర అంశాలపై రెవెన్యూ అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని శివరాజ్ కోరారు.
రామయ్య ఒకే ఇంటికి ఒకే నంబర్ ఉన్న పరిసరాల్లో ఒకే ఇంటి నంబర్‌పై 7 గుంటల రిజి స్వప్నాలు ఎలా జరిగాయి? సంబంధిత రికార్డులు ఎలా సృష్టించబడ్డాయి? అనే అంశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వ భూమికి సంబంధించి పట్టా ఎలా మంజూరైంది? దానికి సంబంధించిన రికార్డులు ఏమిటి? అనే అంశాలపై పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.
ఇళ్ల మధ్య పెట్రోల్‌పై చర్యలు ఏది..?
నివాస గృహాల మధ్య పెట్రోల్ పదార్థాలు ఉపయోగించి భూ షెడ్లు చేయడం వల్ల స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని శివరాజ్ ఆరోపించారు. పెట్రోల్ పదార్థాల వినియోగానికి అనుమతులు ఉన్నాయా? ఉంటే ఎవరు ఇచ్చారు? నిబంధనలకు అనుగుణంగానే వినియోగిస్తున్నారా? అనే అంశాలపై పోలీసులు, సంబంధిత అధికారులు వెంటనే విచారణ చేపట్టాలని కోరారు.
బాధితులపై దాడులు, బెదిరింపులు, కులం పేరుతో దూషణలకు పాల్పడిన వారిపై SC/ST (Prevention of Atrocities) Actతో పాటు ఇతర చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
న్యాయం చేయకుంటే ప్రజా సంఘాలతో ఉద్యమం:
బాధిత కుటుంబానికి రక్షణ కల్పించడంతో పాటు వారి నివాసానికి, ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేకుండా పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలని శివరాజ్ కోరారు.
రెవెన్యూ, పోలీసు అధికారులు సమన్వయంతో విచారణ జరిపి వాస్తవాలను వెలికితీసి బాధితులకు న్యాయం చేయాలని అన్నారు. అధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేయకపోతే మాల మహానాడు, ఎంఆర్‌పీఎస్, గిరిజన సంఘాలు, ఇతర ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి దార్ల శివరాజ్ హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *