Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆదిలాబాదు

సాఫ్ట్ స్కిల్స్ పై విస్తృతోపన్యాసం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సాఫ్ట్ స్కిల్స్ పై విస్తృతోపన్యాసం

వార్త ముఖ్యాంశాలు

  • ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల భాషా విభాగం ఆధ్వర్యంలో విద్యార్థుల సమగ్ర వికాసం కోసం 'సాఫ్ట్ స్కిల్స్' పై విస్తృతోపన్యాసాన్ని యూత్ ట్రైనింగ్ సెంటర్‌ అధ్యాపకుడు శ్రీ ఎస్.
  • వికాస్ అందించారు.
  • ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనేందుకు కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, సమయపాలన, సమస్య పరిష్కార సామర్థ్యం, టీమ్‌వర్క్ మరియు ఆత్మవిశ్వాసం వంటి సాఫ్ట్ స్కిల్స్‌ను నిత్య జీవితంలో అలవర్చుకోవాలని సూచించారు.

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల భాషా విభాగం ఆధ్వర్యంలో విద్యార్థుల సమగ్ర వికాసం కోసం ‘సాఫ్ట్ స్కిల్స్’ పై విస్తృతోపన్యాసాన్ని యూత్ ట్రైనింగ్ సెంటర్‌ అధ్యాపకుడు శ్రీ ఎస్. వికాస్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనేందుకు కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, సమయపాలన, సమస్య పరిష్కార సామర్థ్యం, టీమ్‌వర్క్ మరియు ఆత్మవిశ్వాసం వంటి సాఫ్ట్ స్కిల్స్‌ను నిత్య జీవితంలో అలవర్చుకోవాలని సూచించారు. కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ డా. జి. సాయిప్రసాద్ మాట్లాడుతూ ఉత్తమ ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సబ్జెక్ట్ పరిజ్ఞానంతో పాటు ఈ నైపుణ్యాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. అనంతరం భాషా విభాగాధిపతి శ్రీ. ఎస్.కె. ముజీబ్ మాట్లాడుతూ, విద్యార్థులు తమ అకడమిక్ చదువులతో పాటు ఇలాంటి నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుంటూ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కపిల్, రాకేష్, యోగలక్ష్మి, అక్షయ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *