వార్త ముఖ్యాంశాలు
- సద్ది సమర్పించి మొక్కులు చెల్లించుకున్న భక్తులురాత్రి పాటకచ్చేరీతో సందడిగా మారిన పోలేరమ్మ మాన్యంభక్తుల సౌకర్యాలపై ఎమ్మెల్యే సోమిరెడ్డి సమీక్ష - పోలీసుల పటిష్ట బందోబస్త 🔥.....వినోద్ కుమార్ ......🔥పొదలకూరు, అక్టోబరు 6: తొంభై ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పొదలకూరు గ్రామదేవత శ్రీ పోలేరమ్మ తల్లి జాతర…
- జాతర తొలి రోజైన మంగళవారం నిర్వహించిన ఘటోత్సవం భక్తుల భక్తిశ్రద్ధల నడుమ కన్నులపండువగా సాగింది.
- అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని ప్రత్యేక పుష్పాలంకరణతో తీర్చిదిద్దడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
సద్ది సమర్పించి మొక్కులు చెల్లించుకున్న భక్తులురాత్రి పాటకచ్చేరీతో సందడిగా మారిన పోలేరమ్మ మాన్యం
భక్తుల సౌకర్యాలపై ఎమ్మెల్యే సోమిరెడ్డి సమీక్ష – పోలీసుల పటిష్ట బందోబస్త
🔥…..వినోద్ కుమార్ ……🔥
పొదలకూరు, అక్టోబరు 6: తొంభై ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పొదలకూరు గ్రామదేవత శ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.
జాతర తొలి రోజైన మంగళవారం నిర్వహించిన ఘటోత్సవం భక్తుల భక్తిశ్రద్ధల నడుమ కన్నులపండువగా సాగింది. అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని ప్రత్యేక పుష్పాలంకరణతో తీర్చిదిద్దడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
సంప్రదాయబద్ధంగా ఘటాల తయారీ: జాతరలో కీలక ఘట్టమైన ఘటోత్సవం కోసం కుమ్మరి వర్గానికి చెందిన వారు సంప్రదాయ పద్ధతుల్లో ఘటాలను తయారు చేశారు. తొగటవీధిలోని రజకుల ఇంటి వద్ద ప్రత్యేక సంప్రదాయ సాంగ్యాలు నిర్వహించిన అనంతరం ఘటాలను అమ్మవారి ఆలయ ప్రాంగణానికి తీసుకొచ్చి, ప్రత్యేకంగా అలంకరించి, శాస్త్రోక్తంగా అమ్మవారిని ఆవాహనం చేశారు.
ఇళ్లకు వెళ్లిన ఘటాలు: అమ్మవారిని ఆవాహనం చేసిన ఘటాలు తొలుత పెద్దకాపు మందారామిరెడ్డి, వెంకురెడ్డి, పెద్దగొల్ల మద్దిరిళ్ల నరసింహులు, ఊకోటి లక్ష్మీనారాయణ ఇళ్లతోపాటు పలువురు భక్తుల ఇళ్లకు తీసుకెళ్లారు. అక్కడ భక్తులు ఘటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఘటాలను పురవీధుల్లో ఊరేగించారు. అమ్మవారి నామస్మరణలు, మంగళవాయిద్యాల మధ్య సాగిన ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంది.
సద్ది సమర్పణ: జాతర సంప్రదాయంలో భాగంగా భక్తులు తమ మొక్కుబడులను సద్ది రూపంలో ఘటాల్లో సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రసాదాన్ని స్వీకరించారు. పురవీధుల్లో ఎటుచూసినా భక్తజనం, అమ్మవారి నామస్మరణలతో పండుగ వాతావరణం నెలకొంది.
🔥….. వినోద్ కుమార్ ……🔥
రాత్రి పాటకచ్చేరీ – అధికారుల సమీక్ష: పోలేరమ్మ మాన్యంలో రాత్రి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా పాటకచ్చేరి నిర్వహిస్తారు. భక్తులకు కావాల్సిన మౌలిక సదుపాయాలపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆర్&బీ గెస్ట్ హౌస్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతరకు పొదలకూరు సీఐ గుత్తి వెంకట్రావు, ఎస్ఐ శివరాకేష్ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
🔥….. వినోద్ కుమార్ ……🔥

