Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

అర్హులైన దివ్యాంగులందరికీ సదరం పత్రాలు అందించాలి:

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
అర్హులైన దివ్యాంగులందరికీ సదరం పత్రాలు అందించాలి:

పత్రికా ప్రకటన,
అక్టోబర్ 06,పున్నమి ప్రతినిధి నిర్మల్ అర్హులైన దివ్యాంగులందరికీ సదరం ధ్రువీకరణ పత్రాలు అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సదరం ధ్రువీకరణ పత్రాల జారీపై సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఇప్పటివరకు నిర్వహించిన శిబిరాలు, జారీ చేసిన సదరం సర్టిఫికెట్లు, పెండింగ్ సంఖ్య, తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు సదరం శిబిరాలు నిర్వహించి, అర్హులకు పారదర్శకంగా సదరం పత్రాలు అందజేయాలన్నారు. దివ్యాంగులకు ఇబ్బందులు కలగకుండా ప్రక్రియను నిర్వహించాలన్నారు. సదరం శిబిరం వద్ద అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. వెయిటింగ్ లిస్టులో ఉన్న దివ్యాంగులకు శిబిరాల నిర్వహణ తేదీ, సమయం వివరాలు ముందుగానే అందజేయాలని అన్నారు.
ఈ సమావేశంలో డిఆర్డిఓ విజయలక్ష్మి, జిల్లా ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి పర్యవేక్షకులు గోపాల్ సింగ్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

అర్హులైన దివ్యాంగులందరికీ సదరం పత్రాలు అందించాలి:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *