వార్త ముఖ్యాంశాలు
- అగనంపూడి, పున్నమి ప్రతినిధి, అక్టోబర్ 06.
- ఉక్కు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై జాతీయ ఐ ఎన్ టి యు సి సీనియర్ కార్యదర్శి మంత్రి రాజశేఖర్ నాయకత్వం లోని ఇంటక్ బృందం మంగళవారం ఉక్కు సి.ఎం.డి.
- ని కలిసి కార్మికుల సమస్యలు, భద్రత పై చర్చించారు.
అగనంపూడి, పున్నమి ప్రతినిధి, అక్టోబర్ 06.
ఉక్కు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై జాతీయ ఐ ఎన్ టి యు సి సీనియర్ కార్యదర్శి మంత్రి రాజశేఖర్ నాయకత్వం లోని ఇంటక్ బృందం మంగళవారం ఉక్కు సి.ఎం.డి. ని కలిసి కార్మికుల సమస్యలు, భద్రత పై చర్చించారు. ముఖ్యంగా 2025-26 సంవత్సరా బోనస్ చెల్లించి ఈ దసరా కి కానుక ఇవ్వాలని కోరారు. అలాగే జి.ఎమ్. (హెచ్.ఆర్) ఇంచార్జ్ రవి చంద్రబాబు ని కలిసి కార్మికుల బోనస్ చెలుపు విషయం లో సానుకూలం గా స్పందించి కార్మికుల మనోధైర్యని పెంచే విధంగా నిర్ణయం తీసుకోవాలి అని కోరారు. ఈ సమావేశం లో ఐఎన్టియుసి అధ్యక్షులు పీ.వీ. రమణమూర్తి, చీఫ్ ప్యాట్రాన్ నీరుకొండ రామచంద్రరావు, ప్రచార కార్యదర్శి కోరిబిల్లి అప్పారావు, వైస్ ప్రెసిడెంట్ బంటు రాము గారు పాల్గొన్నారు.