Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

ప్రతి ఊరికి సంక్షేమ భరోసా సంఘం – అన్నవరప్పాడు సదస్సులో కర్రి వెంకటరమణ పిలుపు*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ప్రతి ఊరికి సంక్షేమ భరోసా సంఘం – అన్నవరప్పాడు సదస్సులో కర్రి వెంకటరమణ పిలుపు*

వార్త ముఖ్యాంశాలు

  • పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలం అన్నవరప్పాడులో పొప్పాపు నాగేశ్వరరావు, పొప్పాపు సూర్య నాగేశ్వరరావు గార్ల ఆధ్వర్యంలో సంక్షేమ భరోసా అవగాహన సదస్సు నిర్వహించారు.
  • ఈ సదస్సుకు శ్రీ కృష్ణదేవరాయ సంక్షేమ భరోసా కేంద్రాల వ్యవస్థాపకులు *కర్రి వెంకటరమణ*, సావిత్రిబాయి పూలే మహిళా సంక్షేమ భరోసా సంఘం అధ్యక్షురాలు *కేశవభట్ల వాణిశ్రీ*, ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ అసోసియేట్స్ *నడిగెట్ల శేషు, నరసా శేషు, ప్రసాద్* ముఖ్య అతిథులుగా హాజరై మహిళల సంక్షేమానికి సంబంధించిన…
  • ఈ సందర్భంగా భరోసా కేంద్రాల వ్యవస్థాపకులు కర్రి వెంకటరమణ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని, దానికి కావలసిన అవగాహన, సహాయ సహకారాలు, స్వయం ఉపాధికి సంబంధించిన సహకారం కోసం ఉత్సాహం ఉన్న మహిళలు గ్రూపులుగా ఏర్పడి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలం అన్నవరప్పాడులో పొప్పాపు నాగేశ్వరరావు, పొప్పాపు సూర్య నాగేశ్వరరావు గార్ల ఆధ్వర్యంలో సంక్షేమ భరోసా అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సదస్సుకు శ్రీ కృష్ణదేవరాయ సంక్షేమ భరోసా కేంద్రాల వ్యవస్థాపకులు *కర్రి వెంకటరమణ*, సావిత్రిబాయి పూలే మహిళా సంక్షేమ భరోసా సంఘం అధ్యక్షురాలు *కేశవభట్ల వాణిశ్రీ*, ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ అసోసియేట్స్ *నడిగెట్ల శేషు, నరసా శేషు, ప్రసాద్* ముఖ్య అతిథులుగా హాజరై మహిళల సంక్షేమానికి సంబంధించిన ఐక్యత, అభివృద్ధి, సంక్షేమం, భద్రత అంశాలపై మాట్లాడారు.

ఈ సందర్భంగా భరోసా కేంద్రాల వ్యవస్థాపకులు కర్రి వెంకటరమణ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని, దానికి కావలసిన అవగాహన, సహాయ సహకారాలు, స్వయం ఉపాధికి సంబంధించిన సహకారం కోసం ఉత్సాహం ఉన్న మహిళలు గ్రూపులుగా ఏర్పడి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

మహిళలకు స్వయం ఉపాధికి సంబంధించిన నైపుణ్య శిక్షణలు – జ్యూట్ బ్యాగుల తయారీ, కుట్టు శిక్షణ, బ్యూటీపార్లర్ కోర్సులు, అలాగే డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా హోమ్ కేర్, పర్సనల్ కేర్, హెల్త్ కేర్ తదితర ఉత్పత్తుల విక్రయం ద్వారా ఆదాయ మార్గాల గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ సమాజంలో నిజాయితీగా జీవిస్తూ అభివృద్ధి చెందాలని తెలిపారు.

ఈ కార్యక్రమానికి సహకరించిన పిండి మారయ్య, లీల గార్లను అభినందించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పి. నాగేశ్వరరావు, రంగనీడి గంగాధర్, సూర్య నాగేశ్వరరావు, మారయ్య మరియు గ్రామ మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *