Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
చిత్తూరు

వర్షాలు కురవాలని గ్రామదేవతలకు పొంగళ్ల సమర్పణ (సోమల మండలంలో వైభవంగా పొలిమేర దేవర్లు, అమ్మవార్లకు బోనాల పండుగ)

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
వర్షాలు కురవాలని గ్రామదేవతలకు పొంగళ్ల సమర్పణ (సోమల మండలంలో వైభవంగా పొలిమేర దేవర్లు, అమ్మవార్లకు బోనాల పండుగ)

వార్త ముఖ్యాంశాలు

  • సోమల, అక్టోబర్ 05 (పున్నమి న్యూస్ ప్రతినిధి): వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వానలు కురవాలని ఆకాంక్షిస్తూ సోమల మండలంలోని పలు గ్రామాల ప్రజలు పొలిమేర అమ్మవార్లకు, వలసదేవర్లకు విశేష పూజలు నిర్వహించారు.
  • గన్నావారిపల్లె, అడుసుపల్లి, గుంతచెరువుపల్లి, దాసరివారిపల్లి, భారతంమిట్ట, దిడ్డివారిపల్లి తదితర గ్రామాల ప్రజలు ఉదయాన్నే పొలిమేరలకు తరలివెళ్లారు.
  • పొలాల వద్ద అమ్మవారిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు జరిపి, అక్కడే వంటావార్పు నిర్వహించి సామూహిక భోజనాలు చేశారు.

సోమల, అక్టోబర్ 05 (పున్నమి న్యూస్ ప్రతినిధి):
వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వానలు కురవాలని ఆకాంక్షిస్తూ సోమల మండలంలోని పలు గ్రామాల ప్రజలు పొలిమేర అమ్మవార్లకు, వలసదేవర్లకు విశేష పూజలు నిర్వహించారు. గన్నావారిపల్లె, అడుసుపల్లి, గుంతచెరువుపల్లి, దాసరివారిపల్లి, భారతంమిట్ట, దిడ్డివారిపల్లి తదితర గ్రామాల ప్రజలు ఉదయాన్నే పొలిమేరలకు తరలివెళ్లారు. పొలాల వద్ద అమ్మవారిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు జరిపి, అక్కడే వంటావార్పు నిర్వహించి సామూహిక భోజనాలు చేశారు.
సాయంత్రం వేళ గ్రామాల్లోని నడివీధి గంగమ్మ ఆలయాలకు మహిళలు మంగళవాయిద్యాలతో బోనాలు, పొంగళ్లు ఊరేగింపుగా తీసుకెళ్లి భక్తిశ్రద్ధలతో సమర్పించారు. అలాగే సూరయ్యగారిపల్లిలో పొలిమేర దేవర్ల సందర్భంగా పోకల రామచంద్ర, నరసింహులు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. మండలవ్యాప్తంగా గ్రామదేవతల పండుగలు అత్యంత కోలాహలంగా సాగాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *