Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్‌ పరిసర ప్రాంతాలలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్‌ పరిసర ప్రాంతాలలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్.

వార్త ముఖ్యాంశాలు

  • నంద్యాల మూడవ పట్టణ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్‌ మరియు పరిసర ప్రాంతాలలో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా జిల్లా ఎస్పి సునీల్ షొరాణ్ IPS ఆదేశాలమేరకు నంద్యాల సబ్ డివిజన్ ASP సుస్మిత IPS సూచనలతో మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్…
  • రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఉన్న వాహనాలను కూడా పరిశీలించారు.
  • అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను పూర్తిగా తనిఖీ చేసి, వారి గుర్తింపు, కదలికలపై ఆరా తీశారు.

నంద్యాల మూడవ పట్టణ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్‌ మరియు పరిసర ప్రాంతాలలో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా జిల్లా ఎస్పి సునీల్ షొరాణ్ IPS ఆదేశాలమేరకు నంద్యాల సబ్ డివిజన్ ASP సుస్మిత IPS సూచనలతో మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు ఈ తనిఖీలలో రైల్వే స్టేషన్ మరియు పరిసర ప్రాంతాలతో పాటు ప్రయాణికుల రాకపోకలు జరిగే ప్రదేశాలు, సున్నితమైన మరియు అనుమానాస్పద ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఉన్న వాహనాలను కూడా పరిశీలించారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను పూర్తిగా తనిఖీ చేసి, వారి గుర్తింపు, కదలికలపై ఆరా తీశారు. అవసరమైన చోట విచారణలు నిర్వహించారు. రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల భద్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.ఈ తనిఖీల్లో ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు లేదా అభ్యంతరకర/చట్టవిరుద్ధ వస్తువులు గుర్తించబడలేదు.ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి ముందస్తు తనిఖీలు, భద్రతా చర్యలను నిరంతరం కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు. ప్రజలు కూడా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు లేదా కార్యకలాపాలు కనిపించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *