పున్నమి ప్రతినిధి అక్టోబర్ 3 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ ఏఎంసి చైర్మన్ పదవి కాలం ముగియడంతో కొత్త నియామకంపై కసరత్తు జరుగుతుంది. బొప్పాపూర్ గ్రామానికి చెందిన స్థానిక కాంగ్రెస్ నాయకుడికి అవకాశం కల్పించాలని పార్టీ నేతలు అధిష్టానాన్ని కోరారు ఎఎంసి ఏర్పడినప్పటి నుంచి ఇతర గ్రామాలకు పదవి లభించిందని ప్రస్తుతం జనరల్ రిజర్వేషన్ నేపథ్యంలో స్థానికులకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు
