పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులైన పట్టభద్రులు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి కోరారు.
రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు, పార్టీ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి సూచనల మేరకు శనివారం భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉచిత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను ప్రారంభించారు.
2023 నవంబర్ 1 నాటికి ఏదైనా డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసిన అర్హులు ఓటు నమోదు చేసుకోవచ్చని సీతాలక్ష్మి తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జిల్లా పార్టీ కార్యాలయంలో నమోదు ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ నాయకులు సంకుబాపన అనుదీప్, వేముల ప్రసాద్ బాబు, కరాటే శ్రీను, కన్ని, అన్వర్, పూర్ణ, మనోజ్, ఈమంది గణేష్, శివ, మదాసు పద్మ, షరీఫ్, అంబుల వేణుగోపాల్, జున్నరు రాజేష్ గౌడ్, షణ్ముఖ్, సోహెబ్, సచిన్, రాకేష్ రెడ్డి, వేణు తదితరులు పాల్గొన్నారు.
Uploaded Video:



