మహాత్ముని చిత్ర పటానికి నివాళి అర్పించిన ఎంపీడీవో.
చెన్నారావు పేట మండలం అమీనాబాద్ గ్రామంలో
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) సాయి శివా నంద్ పాల్గొని ప్రసంగించారు.. అనంతరం మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ,మహాత్మా గాంధీ ఆచరించిన సత్యం, అహింస, శాంతి, పరిశుభ్రత మరియు సామాజిక సమానత్వం వంటి విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని పిలుపునిచ్చారు.గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా గ్రామాల అభివృద్ధి, పరిశుభ్రత, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు ప్రజలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామాలలో సుమారు 360 పనులకు శ్రీకారం చుట్టిందని కూలిలకు 60 శాతం సామగ్రికి 40శాతం కేటాయించి గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి 125 రోజుల వరకు వేతన ఉపాధి కల్పించే విధానానికి నాంది పలికిందని అర్హత ఉన్న గ్రామీణ కుటుంబాలు జాబ్ కార్డు ద్వారా పని కోరవచ్చని ప్రభుత్వం నిర్ణయించే రోజువారీ వేతనం చెల్లించబడుతుందని గ్రామీణ రహదారులు, జల సిరి కార్యక్రమం లో భాగంగా నీటి సంరక్షణ, చెరువులు గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి 125 రోజుల వరకు వేతన ఉపాధి కల్పించి గ్రామీణ మౌలిక వసతులు వంటి పనులని చేసుకోవచ్చనిపేర్కొన్నారు..గ్రామాల్ల్లో గ్రామ కుంటలు ఇళ్లల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకువచ్చని వారు పేర్కొన్నారు..ఈ కార్యక్రమంలో ఎంపివో తండా జగదీశ్ గ్రామ సర్పంచ్ దార రంజిత్ ఉప సర్పంచ్ల ఫోరమ్ మండల అధ్యక్షులు యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బండి హరీష్ ఈసి కిషోర్ టిఏ మనోహర్ పంచాయతీ కార్యదర్శి సుమలత రెడ్డి వెటర్నరీ డాక్టర్ కర్ణాకర్ ఫీల్డ్ అసిస్టెంట్ రాములు వార్డు సభ్యులు దయ్యాల రాజు ఊరుగొండ సునీత, హర్షసునీత అమ్మ రాశి డైరెక్టర్ లు లింగ స్వామి బండి దిలీప్ ప్రశాంత్ కుమార్ సాంబయ్య రవి ఇమామ్ అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు..

గ్రామ సభ లో పాల్గొన్న ఎంపిడివో
మహాత్ముని చిత్ర పటానికి నివాళి అర్పించిన ఎంపీడీవో. చెన్నారావు పేట మండలం అమీనాబాద్ గ్రామంలో మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) సాయి శివా నంద్ పాల్గొని ప్రసంగించారు.. అనంతరం మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ,మహాత్మా గాంధీ ఆచరించిన సత్యం, అహింస, శాంతి, పరిశుభ్రత మరియు సామాజిక సమానత్వం వంటి విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని పిలుపునిచ్చారు.గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా గ్రామాల అభివృద్ధి, పరిశుభ్రత, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు ప్రజలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామాలలో సుమారు 360 పనులకు శ్రీకారం చుట్టిందని కూలిలకు 60 శాతం సామగ్రికి 40శాతం కేటాయించి గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి 125 రోజుల వరకు వేతన ఉపాధి కల్పించే విధానానికి నాంది పలికిందని అర్హత ఉన్న గ్రామీణ కుటుంబాలు జాబ్ కార్డు ద్వారా పని కోరవచ్చని ప్రభుత్వం నిర్ణయించే రోజువారీ వేతనం చెల్లించబడుతుందని గ్రామీణ రహదారులు, జల సిరి కార్యక్రమం లో భాగంగా నీటి సంరక్షణ, చెరువులు గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి 125 రోజుల వరకు వేతన ఉపాధి కల్పించి గ్రామీణ మౌలిక వసతులు వంటి పనులని చేసుకోవచ్చనిపేర్కొన్నారు..గ్రామాల్ల్లో గ్రామ కుంటలు ఇళ్లల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకువచ్చని వారు పేర్కొన్నారు..ఈ కార్యక్రమంలో ఎంపివో తండా జగదీశ్ గ్రామ సర్పంచ్ దార రంజిత్ ఉప సర్పంచ్ల ఫోరమ్ మండల అధ్యక్షులు యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బండి హరీష్ ఈసి కిషోర్ టిఏ మనోహర్ పంచాయతీ కార్యదర్శి సుమలత రెడ్డి వెటర్నరీ డాక్టర్ కర్ణాకర్ ఫీల్డ్ అసిస్టెంట్ రాములు వార్డు సభ్యులు దయ్యాల రాజు ఊరుగొండ సునీత, హర్షసునీత అమ్మ రాశి డైరెక్టర్ లు లింగ స్వామి బండి దిలీప్ ప్రశాంత్ కుమార్ సాంబయ్య రవి ఇమామ్ అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు..

