నంద్యాల : మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఆశయాలు నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు.గాంధీ జయంతి సందర్భంగా నంద్యాల గాంధీ చౌక్‌లోని మహాత్మా గాంధీ విగ్రహానికి మంత్రి ఫరూక్, కలెక్టర్ రాజకుమారి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సత్యం, శాంతి, అహింస, జాతి సమైక్యత కోసం గాంధీజీ చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. రైతులు ఐక్యంగా శాస్త్రీయ పద్ధతులు పాటించి ఉద్యాన రంగ అభివృద్ధికి సహకరించాలని కోరారు.
కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ సత్యం, అహింస మార్గంలో స్వాతంత్య్ర ఉద్యమానికి గాంధీజీ నాయకత్వం వహించారని తెలిపారు. లాల్ బహదూర్ శాస్త్రి దేశ రక్షణ, ఆహార భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ‘జై జవాన్–జై కిసాన్’ నినాదాన్ని అందించారని గుర్తుచేశారు. ఇరువురు మహనీయుల ఆశయాలను ఆచరణలో పెట్టి సమాజ, దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
నంద్యాల : మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఆశయాలు నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు.గాంధీ జయంతి సందర్భంగా నంద్యాల గాంధీ చౌక్‌లోని మహాత్మా గాంధీ విగ్రహానికి మంత్రి ఫరూక్, కలెక్టర్ రాజకుమారి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సత్యం, శాంతి, అహింస, జాతి సమైక్యత కోసం గాంధీజీ చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. రైతులు ఐక్యంగా శాస్త్రీయ పద్ధతులు పాటించి ఉద్యాన రంగ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ సత్యం, అహింస మార్గంలో స్వాతంత్య్ర ఉద్యమానికి గాంధీజీ నాయకత్వం వహించారని తెలిపారు. లాల్ బహదూర్ శాస్త్రి దేశ రక్షణ, ఆహార భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ‘జై జవాన్–జై కిసాన్’ నినాదాన్ని అందించారని గుర్తుచేశారు. ఇరువురు మహనీయుల ఆశయాలను ఆచరణలో పెట్టి సమాజ, దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

