Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

మహాలక్ష్మి పేరుతో ప్రజా రవాణా కుదింపు: బీజేపీ ధ్వజం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మహాలక్ష్మి పేరుతో ప్రజా రవాణా కుదింపు: బీజేపీ ధ్వజం

వార్త ముఖ్యాంశాలు

  • మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు – గడ్డం వెంకటేశ్వర్లు కూసుమంచి,ఆక్టోబర్ 2: కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు పథకం పేరుతో ప్రజా రవాణా సౌకర్యాలను కుదించడం సరికాదని బీజేపీ స్టేట్‌ కౌన్సిల్‌ మెంబర్‌ గడ్డం వెంకటేశ్వర్లు విమర్శించారు.
  • బస్సుల సంఖ్య తగ్గడంతో మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.
  • సాయంత్రం 4 గంటల తర్వాత జిల్లాల నుంచి హైదరాబాద్‌కు, రాత్రి 9 గంటల తర్వాత హైదరాబాద్‌ నుంచి జిల్లాలకు వెళ్లే బస్సులు అందుబాటులో లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు – గడ్డం వెంకటేశ్వర్లు
కూసుమంచి,ఆక్టోబర్ 2: కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు పథకం పేరుతో ప్రజా రవాణా సౌకర్యాలను కుదించడం సరికాదని బీజేపీ స్టేట్‌ కౌన్సిల్‌ మెంబర్‌ గడ్డం వెంకటేశ్వర్లు విమర్శించారు. బస్సుల సంఖ్య తగ్గడంతో మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.

సాయంత్రం 4 గంటల తర్వాత జిల్లాల నుంచి హైదరాబాద్‌కు, రాత్రి 9 గంటల తర్వాత హైదరాబాద్‌ నుంచి జిల్లాలకు వెళ్లే బస్సులు అందుబాటులో లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఉచిత ప్రయాణం పేరుతో బస్సుల సంఖ్య తగ్గించడంతో పురుషులపై కూడా అదనపు ఆర్థిక భారం పడుతోందన్నారు. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేసి, ప్రయాణికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *