తిరుమలాయపాలెం అక్టోబర్,03: పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు గ్రామంలో బీజేపీ జిల్లా కార్యదర్శి తమ్మెర రజినీ రెడ్డి భర్త పాపిరెడ్డి దశదినకర్మ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాలేరు ఇంచార్జీ, పాలేరు నియోజకవర్గ శాసనసభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన నున్నా రవికుమార్ హాజరై పాపిరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు లక్ష్మీనారాయణ, బోడ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.