అర్హులైన నిరుపేదలకే ఇళ్లు కేటాయించాలి – బీజేపీ
కూసుమంచి, అక్టోబర్ 3: ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అక్రమాలు, పక్షపాతం జరుగుతున్నాయంటూ బీజేపీ ఆరోపించింది. బీజేపీ మండల అధ్యక్షురాలు పుణ్యవతి ఆధ్వర్యంలో నాయకులు ఎంపీడీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్ ఉదయ్ శ్రీకి వినతిపత్రం అందజేశారు.
అనర్హులకు మంజూరైన ఇళ్లను రద్దు చేసి, క్షేత్రస్థాయి పరిశీలనతో నిజమైన నిరుపేదలను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. గ్రామసభల్లో లబ్ధిదారుల జాబితాను పారదర్శకంగా ప్రకటించాలని కోరారు. అక్రమాలు అరికట్టకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
కార్యక్రమంలో మహేందర్ నాయక్, హట్యా నాయక్, వడ్డెంపూడి నరేష్, ఉదయ్, కోటేష్ తదితరులు పాల్గొన్నారు.