Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
చిత్తూరు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, నిహారిక (కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో ప్రముఖ సినీ నటులు)

తిరుమల, అక్టోబర్ 02 (పున్నమి న్యూస్ ప్రతినిధి):
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని సినీ నటుడు కొణిదెల నాగబాబు కుటుంబ సభ్యులు శుక్రవారం దర్శించుకున్నారు. హీరో వరుణ్ తేజ్, ఆయన సతీమణి లావణ్య త్రిపాఠి, సోదరి నిహారిక కొణిదెలతో పాటు కుటుంబ సభ్యులు ఆలయానికి చేరుకుని స్వామివారి దర్శనం చేసుకున్నారు.
​సంప్రదాయ దుస్తుల్లో విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరికి వేదాశీర్వచనం చేయగా, అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. ప్రముఖ సినీ ప్రముఖులు ఆలయానికి రావడంతో భక్తులు, అభిమానులు వారిని చూసేందుకు ఆసక్తి కనబరిచారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *