Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

*సూళ్లూరుపేటలో గాంధీ జయంతి వేడుకలు – మహాత్ముడి విగ్రహానికి కాంగ్రెస్ ఇంచార్జ్ కిరణ్ కుమార్ నివాళి*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
*సూళ్లూరుపేటలో గాంధీ జయంతి వేడుకలు – మహాత్ముడి విగ్రహానికి కాంగ్రెస్ ఇంచార్జ్ కిరణ్ కుమార్ నివాళి*

వార్త ముఖ్యాంశాలు

  • జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డి.
  • కిరణ్ కుమార్ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ, గాంధీజీ కలలుగన్న సమాజాన్ని నెహ్రూ ప్రధానిగా పునాదులు వేసి దేశాన్ని ముందుకు నడిపించారని అన్నారు.
  • ఇందిరా గాంధీ భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయం, పేదలకు ఇళ్ల నిర్మాణంతో ప్రజలకు ఆశాజ్యోతిగా నిలిచారని కొనియాడారు.బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చి గాంధీజీ పేరును ప్రజలు మర్చిపోయేలా చేస్తోందని విమర్శించారు.

జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డి. కిరణ్ కుమార్ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ, గాంధీజీ కలలుగన్న సమాజాన్ని నెహ్రూ ప్రధానిగా పునాదులు వేసి దేశాన్ని ముందుకు నడిపించారని అన్నారు. ఇందిరా గాంధీ భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయం, పేదలకు ఇళ్ల నిర్మాణంతో ప్రజలకు ఆశాజ్యోతిగా నిలిచారని కొనియాడారు.బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చి గాంధీజీ పేరును ప్రజలు మర్చిపోయేలా చేస్తోందని విమర్శించారు. బీజేపీ సామాన్యులను విస్మరించి కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తోందని ఆరోపించారు.ఎలక్షన్ కమిషన్ ను తన సొంత అజెండాగా మార్చుకొని నరేంద్ర మోడీ, అమిత్ షా లకు తొత్తులా మారి SIR పేరుతో అర్హుల ఓట్లను తొలగిస్తూ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ధిక్కరిస్తోందని మండిపడ్డారు. ప్రతి పౌరుడు మేల్కొని అక్రమ ఓట్ల తొలగింపును అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టౌన్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.కె. యాసిన్ భాషా, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు కన్నంభాకం హరికృష్ణ, కిసాన్ జిల్లా అధ్యక్షులు జోగి వినోద్, నియోజకవర్గ కార్యదర్శి బొగ్గుల సురేష్, టౌన్ మహిళా అధ్యక్షురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *