Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

గాంధీ ఆశయాలే మనకు మార్గదర్శకం – మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గాంధీ ఆశయాలే మనకు మార్గదర్శకం – మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి

వార్త ముఖ్యాంశాలు

  • గాంధీ ఆశయాలతో ముందుకు సాగుదాం: మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి గారు...
  • గాంధీజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు.
  • శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా నిర్మల్ పట్టణంలోని గాంధీ పార్కులో మహాత్మా గాంధీ విగ్రహానికి నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరి రావుతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

గాంధీ ఆశయాలతో ముందుకు సాగుదాం: మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి గారు…

గాంధీజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా నిర్మల్ పట్టణంలోని గాంధీ పార్కులో మహాత్మా గాంధీ విగ్రహానికి నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరి రావుతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అప్పాల గణేష్ చక్రవర్తి మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ శాంతి, అహింసా మార్గంలో దేశాన్ని నడిపించి, స్వాతంత్ర్య ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించారని అన్నారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *