వార్త ముఖ్యాంశాలు
- పేదలు అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చేరి భారీగా వైద్య ఖర్చులు భరించాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) వారికి ఆర్థికంగా అండగా నిలుస్తుందని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు.
- అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సీఎంఆర్‌ఎఫ్ సాయం అందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
- ఆదివారం భైంసా పట్టణంలోని ఎస్‌ఎస్ జిన్నింగ్ ఇండస్ట్రీలో నిర్వహించిన కార్యక్రమంలో 129 మంది లబ్ధిదారులకు రూ.36 లక్షల 13 వేల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
పేదలు అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చేరి భారీగా వైద్య ఖర్చులు భరించాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) వారికి ఆర్థికంగా అండగా నిలుస్తుందని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సీఎంఆర్‌ఎఫ్ సాయం అందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఆదివారం భైంసా పట్టణంలోని ఎస్‌ఎస్ జిన్నింగ్ ఇండస్ట్రీలో నిర్వహించిన కార్యక్రమంలో 129 మంది లబ్ధిదారులకు రూ.36 లక్షల 13 వేల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 5 వేల మందికి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. పేద కుటుంబాల్లో వైద్య ఖర్చులు భారంగా మారకుండా సీఎంఆర్‌ఎఫ్ కొంతమేర ఆర్థిక భరోసా కల్పిస్తుందని అన్నారు. ఎవరికైనా సీఎంఆర్‌ఎఫ్ అవసరం ఉంటే రాజకీయాలకు అతీతంగా నేరుగా తనను సంప్రదించవచ్చని సూచించారు. తన కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్ దరఖాస్తులు, ఇతర ప్రక్రియల కోసం ఇద్దరు సహాయకులు అన్ని వేళలా అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తుమ్మొల్ల దత్తాత్రి, సీనియర్ నాయకులు సోలంకి భీమ్‌రావు, సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర కార్యదర్శి పండిత్‌రావు పటేల్, బీజేపీ పట్టణ మండలాల అధ్యక్షులు రావుల రాము, సిరం సుష్మారెడ్డి, యేశాల దత్తాత్రి, సాయన్న, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు అప్పాల రాకేష్, సాయినాథ్ తదితరులు మాట్లాడారు. ముధోల్ నియోజకవర్గంలో సీఎంఆర్‌ఎఫ్ కోసం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసి లబ్ధిదారులకు సహాయం అందించడం అభినందనీయమన్నారు. వైద్యం, విద్య, సాగునీటితో పాటు నియోజకవర్గ అభివృద్ధికి పలు కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.