వార్త ముఖ్యాంశాలు
- నిర్మల్, అక్టోబర్ 4: తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ, సమాచార–ప్రజా సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం (అక్టోబర్ 5) నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు.
- ఉదయం 9:45 గంటలకు ఐడీఓసీ హెలిప్యాడ్‌కు చేరుకోనున్న మంత్రి, 10 గంటలకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.
- అనంతరం 10:30 గంటలకు గృహ నిర్మాణం, రెవెన్యూ అంశాలపై జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.
నిర్మల్, అక్టోబర్ 4: తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ, సమాచార–ప్రజా సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం (అక్టోబర్ 5) నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9:45 గంటలకు ఐడీఓసీ హెలిప్యాడ్‌కు చేరుకోనున్న మంత్రి, 10 గంటలకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం 10:30 గంటలకు గృహ నిర్మాణం, రెవెన్యూ అంశాలపై జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్న భోజనం అనంతరం 3:30 గంటలకు ఐడీఓసీ హెలిప్యాడ్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.