వార్త ముఖ్యాంశాలు
- బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో నిర్వహించనున్న శరన్నవరాత్రి ఉత్సవాలకు ముధోల్ ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పటేల్‌ను ఆలయ ఈవో, పూజారులు ఆహ్వానించారు.
- శనివారం భైంసా పట్టణంలోని ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్న ఆలయ ఈవో, పూజారులు మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యేను కలిసి ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు.
- ఈ సందర్భంగా శరన్నవరాత్రి ఉత్సవాల్లో నిర్వహించనున్న ప్రత్యేక పూజలు, ఇతర కార్యక్రమాలు, భక్తుల కోసం చేపడుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యేకు వివరించారు.
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో నిర్వహించనున్న శరన్నవరాత్రి ఉత్సవాలకు ముధోల్ ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పటేల్‌ను ఆలయ ఈవో, పూజారులు ఆహ్వానించారు. శనివారం భైంసా పట్టణంలోని ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్న ఆలయ ఈవో, పూజారులు మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యేను కలిసి ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా శరన్నవరాత్రి ఉత్సవాల్లో నిర్వహించనున్న ప్రత్యేక పూజలు, ఇతర కార్యక్రమాలు, భక్తుల కోసం చేపడుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యేకు వివరించారు. ఉత్సవాలకు హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఎమ్మెల్యేను ఆహ్వానించారు.
అనంతరం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా, విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగాలని కోరుకున్నారు.