విశాఖపట్నం, అక్టోబర్ 2: పెదగంట్యాడ ఉక్కు నిర్వాసిత ప్రాంతంలోని విశాఖ విమల విద్యాలయాన్ని ప్రభుత్వ పాఠశాలగా మార్చాలని కోరుతూ ఉపాధ్యాయులు ఎంపీ శ్రీ భరత్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. పాఠశాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తో చర్చిస్తానని ఎంపీ హామీ ఇచ్చినట్లు తెలిపారు.
స్టీల్ ప్లాంట్ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మార్చి 2027తో ప్రస్తుత ఒప్పందం ముగియనున్నందున విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన ఉందని ఉపాధ్యాయులు వివరించారు. పాఠశాలలో ఉక్కు నిర్వాసితులు, కాంట్రాక్ట్ కార్మికులు, నిరుపేద కుటుంబాల పిల్లలు అధికంగా చదువుతున్నారని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా తెలుగుయువత ప్రధాన కార్యదర్శి మొల్లి పెంటిరాజు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




