Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

ఘనపూర్ (స్టేషన్ ) మున్సిపాలిటీ లో 2బి బార్ ఏర్పాటు కోసం దరఖాస్తుల ఆహ్వానం :జిల్లా అబ్కారి శాఖ అధికారి ఎన్. అంజిరెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఘన్‌పూర్ (స్టేషన్) మున్సిపాలిటీలో 2B బార్ ఏర్పాటు కోసం దరఖాస్తుల ఆహ్వానం ---------------------------------------------------------------------- దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు అక్టోబర్ 12 సాయంత్రం 5 గంటల వరకు *లాటరీ ద్వారా ఎంపిక..
  • అక్టోబర్ 16న ఉదయం 11 గంటలకు* జిల్లాలో తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (TCUR) పరిధి ఏర్పాటుతో పట్టణ జనాభా పెరగడం, పట్టణ స్థానిక సంస్థల (ULBs) పరిధి విస్తరణ/విలీనం నేపథ్యంలో 2B బార్ల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఇందులో భాగంగా ఘన్‌పూర్ (స్టేషన్)…
  • అంజిరెడ్డి* బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఘన్‌పూర్ (స్టేషన్) మున్సిపాలిటీలో 2B బార్ ఏర్పాటు కోసం దరఖాస్తుల ఆహ్వానం
———————————————————————-
దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు అక్టోబర్ 12 సాయంత్రం 5 గంటల వరకు
*లాటరీ ద్వారా ఎంపిక.. అక్టోబర్ 16న ఉదయం 11 గంటలకు*
జిల్లాలో తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (TCUR) పరిధి ఏర్పాటుతో పట్టణ జనాభా పెరగడం, పట్టణ స్థానిక సంస్థల (ULBs) పరిధి విస్తరణ/విలీనం నేపథ్యంలో 2B బార్ల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఇందులో భాగంగా ఘన్‌పూర్ (స్టేషన్) మున్సిపాలిటీ పరిధిలో ఒక 2B బార్ ఏర్పాటు కోసం ఆసక్తి గల దరఖాస్తుదారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు *జిల్లా అబ్కారీ శాఖ అధికారి ఎన్. అంజిరెడ్డి* బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ ఎక్సైజ్ (బార్ ద్వారా విక్రయానికి లైసెన్స్ మంజూరు, లైసెన్స్ షరతులు) రూల్స్, 2005 ప్రకారం.. ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు 27.09.2026న దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ జారీ అయిందని పేర్కొన్నారు.
*దరఖాస్తు రుసుము రూ.1,00,000/-* గా ఉందని, ఆసక్తి గల దరఖాస్తుదారులు 12.10.2026 సాయంత్రం 5.00 గంటల వరకు దరఖాస్తులను సమర్పించాలన్నారు.
దరఖాస్తులను ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు, 12.10.2026 వరకు స్వీకరిస్తారన్నారు.
*దరఖాస్తులు సమర్పించాల్సిన ప్రదేశాలు*
1. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి కార్యాలయం, జనగామ జిల్లా, రూమ్ నంబర్ S-8, 2వ అంతస్తు, IDOC కాంప్లెక్స్, జనగామ జిల్లా.
2. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం, వరంగల్, హెచ్. నం. 24-7/211/5/1, ప్రగతి నగర్, ఆర్‌ఈసీ దర్గా రోడ్ సమీపంలో, కాజీపేట, వరంగల్.
3. కమిషనర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, తెలంగాణ రాష్ట్ర కార్యాలయం, అబ్కారీ భవన్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కాంప్లెక్స్, నాంపల్లి, హైదరాబాద్.
*లాటరీ ద్వారా ఎంపిక*
దరఖాస్తుదారుల ఎంపిక కోసం 16.10.2026న ఉదయం 11.00 గంటలకు లాటరీ నిర్వహించనున్నట్లు తెలిపారు.
*దరఖాస్తుతో పాటు జత చేయాల్సిన పత్రాలు*
1. నిర్ణీత నమూనాలో *ఫారం–1(A)* లో దరఖాస్తు.
2. ప్రతి దరఖాస్తుకు రూ.1,00,000/- (ఒక లక్ష రూపాయలు) తిరిగి చెల్లించబడని రుసుముగా జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి, జనగామ జిల్లా పేరుతో డీడీ (లేదా) చలాన్.
3. మూడు కలర్ పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు.
4. ఆధార్ కార్డు (లేదా) పాన్ కార్డు స్వీయ ధృవీకరించిన ప్రతులు.
2B బార్‌లకు సంబంధించిన నోటిఫికేషన్, పట్టణ స్థానిక సంస్థల (ULBs) జాబితా, షెడ్యూల్, తదితర పూర్తి వివరాల కోసం http://tgbcl.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
ఈ మేరకు అర్హత కలిగిన ఆసక్తి గల దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని, నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని కోరారు.
*వివరాల కోసం సంప్రదించాల్సిన నంబర్లు:*
జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి, జనగామ – ఎన్. అంజిరెడ్డి: 87126 58996
ఎస్‌హెచ్‌ఓ, ఘన్‌పూర్: 87126 59006

Leave a comment

Your email address will not be published. Required fields are marked *