Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నంద్యాలలో జనసేన నాయకుల ఘన నివాళులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నంద్యాలలో జనసేన నాయకుల ఘన నివాళులు

వార్త ముఖ్యాంశాలు

  • జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ నందు గల గాంధీజీ విగ్రహానికి జనసేన పార్టీ నాయకులు రాచమడుగు చందు మరియు రాచమడుగు రాంబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జనసేన నాయకులు రాచమడుగు చందు మాట్లాడుతూ:"సత్యం, అహింస అనే ఆయుధాలతో…
  • ఆయన చూపిన శాంతియుత పోరాట పంథా, సమాజ హితం కోసం ఆయన చేసిన త్యాగాలు నేటి తరానికి నిరంతరం స్ఫూర్తిదాయకం.
  • గాంధీజీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ నందు గల గాంధీజీ విగ్రహానికి జనసేన పార్టీ నాయకులు రాచమడుగు చందు మరియు రాచమడుగు రాంబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జనసేన నాయకులు రాచమడుగు చందు మాట్లాడుతూ:”సత్యం, అహింస అనే ఆయుధాలతో దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన మహనీయుడు మహాత్మా గాంధీ. ఆయన చూపిన శాంతియుత పోరాట పంథా, సమాజ హితం కోసం ఆయన చేసిన త్యాగాలు నేటి తరానికి నిరంతరం స్ఫూర్తిదాయకం. గాంధీజీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. సమాజంలో మంచి మార్పు కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడటమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి. జనసేన పార్టీ సిద్ధాంతాలు కూడా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం, నీతివంతమైన పాలన దిశగానే సాగుతున్నాయి.” ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఠాగూర్, సంజీవరాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *